పుట:Aandhrakavula-charitramu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

531

శ్రీనాథుఁడు

giri who extended his power over part of the Rajamahendri district and Pithapur or Peddapur his Capital )” అనీ వ్రాసియున్నారు. దొరగారు రావు సింగభూపాలఁ డన్న పేరు చూచి పిఠాపురములో రావువారు సంస్థానాధిపతులుగా నుండుటను బట్టి రాజమహేంద్రమండలమని భ్రమపడి యుందురు. దేశికులవారి 'సుభాషితనీవి' వ్యాఖ్యోపోద్ఘాతములో “రాజమహేంద్రవరనగరస్థితసర్వజ్ఞసింగక్షమావల్లభేన” అని యేల వ్రాయఁబడెనో తెలియరాకున్నది. ఈ రెంటినిబట్టి కాఁబోలును వెలుగోటివారి వంశ చరిత్రమును వ్రాసినవారుపోద్ఘాతములో

"తొమ్మిదవ తరమువాఁడై న లీగమనాయఁడు సింహాద్రి మొదలగు సబ్బినాటిరాజ్యము నాక్రమించి యేలినట్లును మఱియొక శాఖాంతరమునందు 9వ తరమువాఁడైన యన పోతనాయఁడు రాజమహేంద్రవరమురెడ్లను గొట్టి యా దేశము నేలినవాఁడనియు, వంశావళిలో వారి చరిత్రములలో వ్రాయఁబడి యున్నది .......... లింగమనాయఁడు అనపోతానాయఁడుగార్ల చరిత్రములలో వీరు సింహాద్రి రాజమహేంద్రవరము మొదలగు రాజ్యముల నా క్రమించినారనియు .......... కాఁబట్టి నిజముగ తొమ్మిదవతరమువా రా దేశముల నాక్రమించి యేలి తమ పుత్రాదుల నచట నిలిపి యుండవలెను" అని వ్రాసి యున్నారు.

[రపార్జవసుధాకర కర్తయగు సింగభూపాలుఁడును, శ్రీనాథాదులచే దర్శిం బడిన సింగభూపాలుఁడును భిన్నులనియు, రసార్ణవనుధాకరక ర్తకు సర్వజ్ఞ బిరుదము లేదనియు, అతని మనుమఁడును. శ్రీనాథునికాలపువాఁడునగు సింగభూపాలునికే సర్వజ్ఞబిరుదము కలదనియు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారి యాశయము. [శృంగార శ్రీనాథము పుట 211] వెలుగోటివారి వంక చరిత్రలో వీరిరువురికిని సర్వజ్ఞభిరుదమున్నట్లు చెప్పఁబడినది. శ్రీనాథుఁడు కాంచినది మొదటి సర్వజ్ఞసింగభూపతియే యని “ఆంధ్రకవి తరంగిణి' లో నున్నది (ఐదవ నంపుటము పుట.44] డాక్టరు గిడుగు - వేంకటసీతాపతిగారు రసార్ణ వసుధాకర నూతనముద్రణ పీఠికలో రసార్జవసుధాకరకర్తను శ్రీనాధుఁడు చూచినట్లు చెప్పియున్నారు ]