పుట:Aandhrakavula-charitramu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

478

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మామిడిసింగన్న ప్రేరణముచేత తదంకితముగా రచింపఁబడినది. ఈ వేమన్న పెద్దకోమటివేమన్న కాఁ డని కొందఱు భ్రమపడి యేమేమో వ్రాసిరి కాని యతఁడు పెదకోమటివేమన్నయనుటకు గ్రంధములోనే కొన్ని నిదర్శనము లున్నవి.

         క. శ్రీమహిత పెద్దకోమటి
            వేమక్షితిపాలరాజ్యవిభవకళార
            క్షామణికి సింగసచివ గ్రామణికిం బాండ్యరాయగజకేసరికిన్.

షష్ఠ్యంతపద్యములలో నిట్లుండుటయే కాక పుస్తకాంతమున ఫల శ్రుతిలో,

      "భారద్వాజ గోత్రుండును నాపస్తంభ సూత్రుండును
      నుభయకులపవిత్రుండును మామిడి పెద్దనామాత్య
      పుత్రుండును పెద్దకోమటివేమభూపాలకరుణాపా
      త్రుండును నైన వినయవివేకసాహిత్య సింగనామాత్య
      పుణ్యశ్లోకుండు. "

అని స్పష్టముగా పెదకోమటి వేమభూపాలుఁడని చెప్పఁబడి యున్నది. నైషథమును ముద్రించినవారు షష్ఠ్యంత పద్యారంభమును 'శ్రీమహీతు పెద్ద కొమరుఁడు" అని యర్ధము లే కుండునట్లు సవరించి పద్యమును పాడుచేసిరి. నైషధకావ్యకృతిపతి యైన మామిడిసింగనామాత్యుఁడు వేమనృపాలుని మంత్రి యైనట్లు కవి యీ పద్యమున జెప్పియున్నాఁడు.

        సీ. తనకృపాణము సముద్ధతవైరిశుద్దాంత
                 తాటంకముల కెగ్గుఁ దలఁపుచుండఁ
           దనబాహుపీఠంబు ధరణిభృత్కమరాహి
                 సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ