పుట:Aandhrakavula-charitramu.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

443

వి ను కొం డ వ ల్ల భ రా యఁ డు

గారు, శ్రీ బండారు తమ్మయ్యగారు, శ్రీ టేకుమళ్ల అచ్యుతరావుగారు మున్నగువా రభిప్రాయపడినారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, శ్రీ కిళాంబి రాఘవాచార్యులుగారు, శ్రీ చాగంటి శేషయ్యగారు మున్నగువారిది శ్రీనాథకృతమే యని విశ్వసించుచున్నారు.

ఇయ్యది శ్రీనాధకృతమే యని వివరించుచు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామము (శృంగార గ్రంధమాల) పీఠికలో వ్రాసిన కొన్ని వాక్యములు ఇచట నీయఁబడుచున్నవి.

"సులక్షణసారము, అప్పకవీయము, లక్షణదీపిక, సర్వలక్షణ సారసంగ్ర హము మొదలగు లక్షణ గ్రంథములందు శ్రీనాధుని వీధినాటకము లోనివిగా నుదాహృతములయిన పద్యములీ క్రీడాభిరామమునఁ గలవు. శ్రీనాధుఁడే యిూ గ్రంధమును రచించి వల్లభరాయని పేరుపెట్టఁగా గ్రంధమున వేఱు పేరున్నను, రంగనాధ రామాయణాదులవలె నీగ్రంథము కూడఁ గర్తయగు శ్రీనాథుని "పేరనే లోకమునఁ బ్రచారముగాంచి యుండుటచే నప్పకవ్యాదులట్లు చెప్పి యుండవలెను. అప్పకవ్యాదు లుదాహరించిన పద్యములు క్రీడాభి రామమున నానుపూర్వితో నున్నవి, ప్రక్షిప్తము లనఁగుదురదు. వల్లభ రాయcడును, శ్రీనాథుఁడును సమకాలమువారు గాకపోవుదురేని, శ్రీనాధుఁ డాతని పేర గ్రంధము రచించుట యసంభవమగును. అట్టి చిక్కులేదు. శీనాథుఁడును. వల్లభరాయఁడును సమకాలమువారు. వల్లభరాయని పెద్ద తండ్రి యగు లింగనమంత్రి, విద్యానగరపు హరిహరరాయల మంత్రి, రెండవ మూఁడవ హరిహరరాయండ్రు క్రీ. శ. 1402, 1412 వఱకు నుండిరి. లింగ మంత్రి వారిలో నెవరియొద్ద మంత్రియయిన యుండినను వల్లభరాయఁడు మన శ్రీనాధుని సమకాలమువాఁడే యగును...... మఱియు నీ గ్రంధమున వల్లభరాయని వాగ్వైభవ దాతృత్వాది వర్ణనము మితిమీఱి యున్నది. గ్రంధకర్తయే తానగుచో వల్లభరాయఁ డట్లా కందపద్యాష్టకమును రచించుకొని యుండఁడు. ఆ పద్యములు భీమఖండాదులలోని కృత్యవతరణికా పద్యముల పోలిక గలిగియున్నవి ...... మఱియుఁ గృత్యవసాన పద్య