444
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
మునఁ "గాలభైరవుఁడు కవీంద్రకాంక్షిత త్రిదశ మహీరుహమగు వల్లభరాయనికి సమగ్ర వై భవాభ్యుదయములు కృపసేయు" నని యాశీర్వచనమున్నది. సూత్రధారోక్తిగాను, భరతోక్తిగాను నయినను గంథకర్తయగు వాఁ డిట్లు చెప్పుకొనుట సరసముగాదు. ఇది తానే తుమ్ముకొని, తానే శతాయుస్సని యనుకొనునట్లున్నది కవీంద్ర కాంక్షిత త్రిదశ మహీరుహము గావున వల్లభరాయడు విశేష ధనమొసగి కవి యశఃకాంక్షియై యేతత్కృతి కర్తృత్వమును దనపై వేయించు కొన్నాఁడని తలఁచుట ప్రమాణదూరము కాదు. అట్టి సంప్రదాయముగూడ నాకాలమున హెచ్చుగాఁగలదు శ్రీనాధ కవి యనేక స్థలముల నిందుదన తక్కిన గ్రంథముల రచనములను జేర్చెను. ఆపోలిక లీగ్రంథము శీనాథ కృత మేయని చెప్పక చెప్పచున్నవి? [క్రీడాభిరామము. ఉపోద్ఘాతము-పుటలు 9-12]
క్రీడాభిరామ మనెడి యీ వీధిరూపకము పురబాహ్యాంతరప్రదేశములయందు విహరించుచు నోరుగంటినివాసులైన గోవిందమంచనశర్మ యను బ్రాహ్మణ శిఖామణియు నాతని చెలికాఁడై న టిట్టిభసెట్టి యను వైశ్యవిటగ్రామణియు నొcడారులతోఁ దాము చూచుచు వచ్చిన వివిధ వినోదములనుగూర్చి చేసిన సంభాషణ రూపమున నున్నది. కవి యేతద్రూపకప్రస్తావనలోఁ దన తాత తాత యైన చంద్రామాత్యుఁడు బుక్కరాజుమంత్రిగా నుండినట్లీ క్రింది పద్యమునఁ జెప్పెను
శా. "కర్ణాటక్షితినాథుఁ డైన పెదబుక్కక్ష్మాపదేవేంద్రున
భ్యర్ణామాత్యుని దానఖేచరునిఁ జoద్రాధీశు బంధుప్రియున్
వర్ణించుం గవికోటి శంకరజటావాటీ తటాంతర్నదీ
స్వర్ణద్యంబు తరంగరిcఖణలసత్పాహిత్యసౌహిత్యయై".
ఈ ప్రస్తావనలోనే కవి తన పినతాత యైన లింగమంత్రి 1377 వ సంవత్సరము మొదలుకొని రాజ్యపాలనము చేసిన హరిహరరాయల కొలువులో నుండినట్లీ పద్యమునఁ దెలిపెను.