Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

442

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

"కందుకకేళి సల్పెడు ప్రకారమునన్' అను పద్యమును "కుసుమం బద్దిన చీరకొంగు వొలయిన్' అను పద్యమును శ్రీనాథుని వీధినాటకములోనివని యప్పకవి యుదాహరించి యుండుటచేతను, క్రీడాభిరామములోని "గార్గ్య సిద్ధాంతమతముషఃకాలకలన" "శకున మూనుట యది బృహస్పతిమతంబు" "వ్యాసమతము మనఃప్రసాదాతిశయము" "విప్రజనవాక్య మరయంగ విష్ణు మతము' అను 60 వ పద్యమునందలి ప్రథపు ద్వితీయ చతుర్దపాదములు శ్రీనాథుఁ డిటీవల రచియించిన భీమేశ్వరపురాణ తృతీయాశ్వాసములో "గార్గ్యసిద్దాంతమత ముష8కాలకలన, శకున మూనుటయది బృహస్పతి మతంబు, విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము, సర్వసిద్ధాంత మతమభిజిత్తు సమ్మత మగు" అను 41 వ పద్యమునఁ బ్రధమ ద్వితీయ తృతీయపాదములుగా నుండుటచేతను, కొందఱు శ్రీనాథుఁడే క్రీడాభిరామమును రచించి దాని కర్తృత్వమును వల్లభరాయని కారోపించె నని చెప్పుదురు, కాని యిది సిద్ధాంతము చేయుటకుఁ దగిన నాధారము లేవియుఁ గానరాపు. అప్పకవికిఁ బూర్వమునం దున్నవారును వల్లభరాయనికిఁ జేరువకాలమునం దున్నవా రగుటచేత నాతనింగూర్చి యెక్కువగా దెలియఁదగినవారును నైన చిత్రకవి పెద్దన్న, ముద్దరాజు రామన్న, శ్రీధరుఁడు మొదలైన లక్షణగ్రంధకర్త లందఱును బూర్వోక్త పద్యద్వయముసు వల్లభరాయని వనియే తమతమ లక్షణగ్రంధములయం దుదాహరించి యుండఁగా వల్లభరాయని కిన్నూఱు సంవత్సరముల వెనుక నుండిన యప్పకవి యవి శ్రీనాధుని వనుట యజ్ఞానమూలము గాని తెలిసి చెప్పుటవలనుగాదు. వల్లభరాయని దర్శింపబోయినప్పు డతఁడు క్రీడాభిరామము రచించుచుండఁగాఁ జూచి యుండుట చేతనో, తత్పద్యరచనము నందాతనికి దోడుపడి యుండుటచేతనో శ్రీనాధుఁడు తాను తరువాత రచించిన భీమఖండమునందు సంస్కృతశ్లోకమును దెనిగించుచు 'గార్గ్యసిద్దాంతమత" మన్న పద్యములోc గొంతభాగమట్లే వేసి యుండవచ్చును. అంతమాత్రముచేత బుస్తక మంతయు శ్రీనాథ విరచిత మనుట యతిసాహసము. [క్రిడాభిరామము వినుకొండ వల్లభరాయ కృతమని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు, శ్రీ వేమూరి విశ్వనాథశర్మ