పుట:Aandhrakavula-charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

న న్న య భ ట్టు

పోవుట రాజు కాలములోనే నన్నయభట్టాంధ్రభారతరచన మధ్యమున లోకాంతరగతుఁ డగుటను సూచించుచున్నది. తిక్కనసోమయాజి విరాట పర్వము నందు

 ఉ. ఆదరణీయసారవివిధార్ధగతిస్పురణంబు గల్గి య
    ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెనుపొంది యుండ నం
    దాదిఁ దొడంగి మూడుకృతు లాంధ్రకవిత్వ విశారదుండు వి
    ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్

అని చెప్పుట నాధారము చేసికొని యిప్పటివారు కొందఱు నన్నయభ ట్టారణ్యపర్వమునంతను సంపూర్ణముగానే చేసెననియు, అందుచేతనే తిక్క_న విరాటపర్వముతో నారంభించె ననియుఁ దిక్కన కొలమునాఁటి కారణ్యపర్వాంతమువఱకు నుండినను దరువాత కారణముచేతనో యది నశింపఁగాఁ ఎఱ్ఱాప్రగడ నన్నయభట్టునందలి గౌరవముచేత నాతని పేరనే పూరించెననియు, ము న్నెవ్వరు కనని వినని కొత్త వాదము నొకదాని నారంభించిరి. ఈ వాద మపూర్వమయినదే నన్నయభట్టు మరణానంతరమున నిన్నూఱు సంవత్సరములకుండిన తిక్కనసోమయాజి వఱకును నారణ్యపర్వము సంపూర్ణముగానే యుండిన దcట. అట్లయినచో వీరి వాదానుసారముగా

 ఉ. సారకథాసుధారస మజసము నాగళపూరితంబుగా
     నారఁగఁ గ్రోలుచున్ జనులు హర్ష రసాంబుధిఁ దేలునట్లుగా
     భారతసంహితన్ మును త్రిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టివి
     ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టఁ గొల్చెదన్

అని మారన తన మార్కండేయపురాణములో నన్నయభట్టును స్తుతించుచు నతఁడు త్రిపర్వము లొనర్చెనని చెప్పి యుండుటచేత, ది 1323 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసిన ప్రతాపరుద్రుని దండనాధుఁ డైన నాగనగన్నదండనాధున కంకితపు చేయఁబడిన మార్కండేయపురాణ గంధకర్త కాలము వఅకు ననగా 1323 వ సంవత్సర ప్రాంతము వఱకు నన్నయభట్టకృతారణ్యపర్వము పూర్ణముగ నుండెనని చెప్పవలెను. ఎఱ్ఱాప్రగడ వలన