పుట:Aandhrakavula-charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ఆంధ్ర కవుల చరిత్రము

యందసమానపాండిత్యము గల నారాయణభట్టు భారతాంధ్రీకరణమునందు భారతరణమునం దర్జునునికి శ్రీకృష్ణుడు సహాయుఁ డయినట్టే విశేష సహాయుఁడయి యుండును. భారతాంధ్రీకరణమునందు సాహాయ్యపడు చుండిన హేతువుచేతఁ గూడ రాజరాజనరేంద్రుఁడు నారాయణభట్టున కీ దానము చేసియుండవచ్చును ! ఈ దానశాసనమును రచించినవాఁడు నన్నయభట్టు: రాగిఱేకులమీఁదఁ జెక్కినవాఁడు గండాచార్యుఁడు. "కావ్యానాం కర్తానన్నియభట్టో లేఖకోగండాచార్య?" అని శాసనము యొక్క- కడపటిభాగమునం దున్నది. దీని వలన రాజరాజనరేంద్రుని పరిపాలనము నందు ముప్పది రెండేండ్లవఱకును నన్నయభట్టారకుఁడు జీవించియుండుట నిశ్చయము. ఇతఁడిప్పటికే భారతాంధ్రీకరణము నారంభించి యుండును. ఈతని మరణముచేతనో కొందఱు చెప్పినట్టు మతిభ్రమణముచేతనో రాజనరేంద్రుని జీవితకాలములోనే యాంధ్రభారతరచనము నిలిచిపోయియుండును. ఈ విషయమయి చెప్పఁబడెడు కథ లన్నియు విశ్వాసార్హములు కాకపోయినను, తరువాత రాజరాజనరేంద్రుఁడు తెనుఁగుభారతమును బూర్తిచేయింపఁ బ్రయత్నించె నన్నకధను స్థాపించుచున్నవి. మరణమునకుఁ గాని మతిభ్రమణమునకుఁ గాని మనవారు కధలలోఁ జెప్పిన కారణములు గాక వేఱుకారణము లుండవచ్చును. మరణము గాని మతిభ్రమణము గాని కవి యొక పర్వమును సాంతముగా విరచించువఱకును నిలిచియుండవు. అవి కవిని సగము చేయుచుండఁగానే నడుమ నెప్పడో వాతవేసికొన వచ్చును. ఆశ్వాసమధ్యములో 'శారదరాత్రు' లన్న పద్యమును రచించు నప్పటికే మృత్యువాసన్నమయి నన్నయభట్టారకుని గ్రంథరచనమున కసమర్థుని జేసి యుండును. ఈ శాసనానంతరమున రాజనరేంద్రుఁడు సహితము చిరకాలము జీవింపక తొమ్మిది సంవత్సరములలోనే మృత్యుముఖగతుఁడయ్యెను.రాజనరేంద్రుఁడు నారాయణభట్టునకు నందమపూడి యగ్రహారమును, పావులూరి మల్లన్నకు నవఖండవాడ యగ్రహారమును, ఇచ్చినను నన్నయభట్టన కగ్రహారాదు లేవియు నిచ్చినట్టు కనబడదు. భారతాంధ్రీకరణసమాప్తి యైనతరువాత నియ్యఁదలఁచెనేమో ! ఇట్లియ్యక