పుట:Aandhrakavula-charitramu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

419

జ క్క య క వి

రాజ్యములోని కడపటిదశయం దున్నట్టూహింపఁదగి యున్నది. దేవరాయ మహారాయలు క్రీ స్తుశకము 1406 వ సంవత్సరము మొదలుకొని 1422 వ సంవత్సరము వఱకును కర్ణాటక రాజ్యమును పరిపాలనము చేసెను. కాబట్టి సిద్దన్న మంత్రి యీపయి నుండక పోయినను 1422 వ సంవత్స రమువరకు నున్నట్లు నిశ్చయము. అందుచేత విక్రమార్క చరిత్రము 1410 వ సంవత్సరమునకును 1420 వ సంవత్సరమునకును మధ్యకాలము నందు రచియింపఁబడిన దని నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును. విష్ణుపురాణము తెనిగించిన వెన్నెలగంటి సూరన్న తాతయైన సూర్యుఁడీ సిద్దన్న పెద్దతండ్రియైనట్టు విక్రమార్కచరిత్రలోని షష్ట్యంతములలో నొకటయిన యీ క్రింది పద్యమునందుఁ జెప్పఁబడి యున్నది.

        ఉ. వెన్నెలగంటి సూర్యుఁడు వివేకగుణాఢ్యుడు వేదశాస్త్రసం
            పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
            గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
            సన్నుతిఁ గన్న సిద్ధనకు సంతతదానకళావినోదికిన్

జక్కనకవి తన విక్రమార్కచరిత్రమునందు భారతమును తెనిఁగించిన కవిత్రయమగు నన్నయ్యభట్టారకుని, తిక్కన సోమయాజిని, ఎఱ్ఱాప్రగడను మాత్రమే యీక్రింది పద్యములతో స్తుతించి యున్నాఁడు.

        ఉ. వేయి విధంబులందుఁ బదివేవురు పెద్దలు సుప్రబంధముల్
            పాయక చెప్పి రట్లు రసబంధురభావభవాభిరామధౌ
            రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రసస్తి కెక్కిరే
            యేయెడ నన్నపార్యుగతి నిద్దరనట్టి మహాత్ముఁ గొల్చెదన్.

        చ. పరువడి దేవభాషఁగల పంచమవేదము నాంధ్రభాష సు
            స్థిరత రచించుచోఁ గృతిపతిత్వముఁ గోరి ప్రసన్నుఁ డైన యా
            హరిహరనాధుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు వెవ్వఁ డా
            పురుషవరేణ్యుదిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్