418
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సీ. విమలవర్తనమున వేదశాస్త్ర, పురాణ
వాక్యార్థ సరణికి వన్నె పెట్టె
పరమహృద్యంబైన పద్యశతంబున
దేవకీతనయు విధేయుఁ జేసె
రసికత్వమున దేవరాయమహారాజ
కరుణాకటాక్ష వీక్షణముఁ గాంచె
కర్ణాటకటకమ్ము కలయంగ మెచ్చంగఁ
గడఁక విద్యాప్రౌఢి ఘనత కెక్కె
గురులఁ బోషించె సత్కవీశ్వరుల మంచె
బ్రజలఁ బాలించె భాగ్యసంపద వహించె
హరిత మునిముఖ్యవంశరత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయ జన్నమంత్రి.
సీ. చిత్ర గుప్తున కై నఁ జింతింప నరుదైన
గణిత విద్యా బ్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
కవిజనంబులు మెచ్చఁగా నొనర్చె
నాణిముత్యములసోయగము మించిన వ్రాలు
వరుసతో నిరుగేల వ్రాయ నేర్చె
నాత్మీయ లిపి యట్టు లన్యదేశంబుల
లిపులను జదువంగ నిపుణుఁడయ్యె
దేవరాయమహారాయధీవిధేయ
మంత్రివల్లభచామనామాత్యదత్త
చామరచ్ఛత్ర భూషాది సకలభాగ్య
చిహ్నముల నొప్పి జన్నయసిద్ధమంత్రి.
తండ్రియు కుమారుఁడును గూడ దేవరాయమహారాజు వద్ద మంత్రులుగా నున్నట్లు చెప్పఁబడినందున, కుమారుఁడయిన సిద్దన్న యాతని