పుట:Aandhrakavula-charitramu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       చ. అరదముపై నుదగ్రుఁ డగు నంగిరునిం గని నెమ్మొగంబునం
            దరహసితంబు చెన్నొసఁగ దానవసూదనుఁ డల్ల నిట్లనున్
            మరలు మునీంద్ర ! నీకు వసమా యసమాయుధ కేళి కేలికిం
            దరమె మదీయసాయకవితానము లిప్పడు గోలుపుచ్చవే !

        చ. తరుణుల వీరముద్దియలతాఁకునఁ జిందఱవందఱైన క్రొ
            న్నురువులలోన శైవలము నూలుకొనంగ నితంబపంక్తిపైఁ
            బొరలు తరంగరాజి విరిపువ్వులు వీడిన కుంతలంబులన్
            బరఁగఁ బదంబులం దెఱఁగి పైcబడ నేడ్చు విటాలికైవడిన్

        శా. ఈ రూపంబున సంసృతిం దొఱగి మీ రెంతెంత యేచింతలన్
            జేరం గోరక యూరకున్న నిటు విచ్చేయంగఁజేయం గడున్
            భారంబే విను నంతయుం గలిగెనో బాలార్కబింబింబులో
            నారంగూరిన యంధకారమన నాహా ! సాహసం బెట్టిదో !

         శా. ఓరీ ! బ్రాహ్మణధూర్త! నాయెదుట నోహో ! సాహసం బెట్టిదో
             వైరిం గోరి నుతించు మాట లెటుగా వచ్చెం గృతఘ్నా ! యిది
             న్నోరే యెవ్వరి కెవ్వ రయ్యెదరు నిన్నుం బెంచి మన్నించినన్
             గారామై యిటు చేసితే తొలఁగు మింకం జాలు నీకార్యముల్.