పుట:Aandhrakavula-charitramu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        హాలాపానవిహార సౌరమహిళాహంకార దోస్సారమై
        హేలాపల్లవహేతిఖండితమహాహేమంతసామంతమై.

ఇట్లొక పద్యమును రెండు పద్యములను జూపుటవలన నీతనికవిత్వశైలి తెలియఁజాలదు గనుక సోముని హరివంశమునందలి యుషాకన్యాపరిణయ కథలోని కొంత భాగము నిందుఁ బ్రకటించుచున్నాను. ఇతనికిఁ దిక్కన సోమయాజియందు మిక్కిలి గౌరవ ముండుట యితఁడు హరివంశము నందుఁ జెప్పిన 'ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణితం బయిన శ్రీమహాభారత కథానంతరంబున శ్రీమత్సకలభాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీనగుణసనాథ సోమనాధ ప్రణీతం బయిన'యను గద్యము వలన స్పష్టముగా దెలియవచ్చుచున్నది. ఎఱ్ఱాప్రెగడకు డెబ్బది యెనుబది సంవత్సరములకుఁ దరువాత నున్న బ్రౌఢకవి మల్లన మొదలయినవా రీతనిని పూర్వకవినిగా స్తుతించినారు.

      ఉ. నన్నయభట్టుఁ దిక్కకవి నాచనసోమని భీమనార్యుఁ బే
          రెన్నికఁ జిమ్మపూడియమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్
          సన్నుతి చేసి వాక్యసరసత్వము వీనుల కింపుమీఱ న
          త్యున్నతిగా నొనర్తు నెఱయోథులు మేలనఁ గావ్య మిమ్ములన్.

అని పోతనామాత్యుని పుత్రుఁడయిన ప్రౌఢకవి మల్లన [1] తన రుక్మాంగద చరిత్రమునందు సోముని స్తుతించి యున్నాఁడు.

      సీ. ................నన్నపార్యువర్ణనలఁ బొగడి.

      గీ. వెలయఁ దిక్కనసోమయాజుల భజించి
          యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చ నునిచి
          సుకవి సోముని నాచనసోము నెరఁగి
          కవి మనోనాధు శ్రీనాధు ఘనత మెచ్చి.

  1. ఇతఁడు పోతనామాత్యుని పుత్రుఁడు కాఁడు. ఇతఁడు శ్రీవత్సగోత్రుఁడు.పోతన కౌండిన్యగోత్రుఁడు. ఈ మల్లన తండ్రి పోతయమంత్రి.