పుట:Aandhrakavula-charitramu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

357

నా చ న సో ముఁ డు

అని భాగవతషష్ఠస్కంధమునందు సింగయయు సోముని పూర్వకవిగాఁఁ జెప్పినాఁడు. పిల్లలమఱ్ఱి పినవీరన్నయు "మా నన్నయభట్టుఁ దిక్క కవి నెఱ్ఱాప్రెగ్గడన్ సోమునిన్" అని యెఱ్ఱాప్రెగడతరువాత సోమునిఁ జెప్పినాఁడు. వీని నన్నిటినిబట్టి విచారింపఁగా సోమకవి యెఱ్ఱాప్రెగడకుఁ దరువాతను శ్రీనాథాదులకుఁ బూర్వమునందును నుండుట స్పష్టము. కాఁబట్టి యతఁడు హూణస. 1360-70 సంవత్సరప్రాంతములయందున్నాcడని యించుమించుగా నిశ్చయింపవచ్చును. దీనినిబట్టి విచారింపఁగా నాచన సోమనాధుఁ డిప్పటి కయిదువందలయేఁబది సంవత్సరముల క్రింద నున్నట్లు తేలినది. ఈ విషయమయి పెంచి చెప్పుట కంటె హరివంశములోని పద్యములను వ్రాయుటయే చదివెడివారికి మనోహరముగా నుండవచ్చునను తలంపుతో నట్లు చేయుచున్నాను.

       మ. ఒకనాఁ డిందుధరుండుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి
           న్ని కటానేక విహారదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
           నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పైఁ జల్ల ద
           ర్పకబాణంబుల కెల్ల నెల్ల యగు సౌభాగ్యంబుతో నాడఁగన్

ప. అట్టియెడ.

       సీ. కిసలయంబులతోడఁ గెంగేలు తడవెట్టి
                            విరులపై నఖకాంతి విజ్జి రాల్చి
          లేఁదీగలకు దనూలీలఁ గానుక యిచ్చి
                            గుత్తులఁ బాలిండ్లు గొలిచి చూచి
          చలిగాలి నిశ్వాససౌరభంబుల నాcగి
                            యళిపంక్తి కురులతో నలుక దీర్చి
          పుప్పొళ్ళ నెలగంధములు వియ్యమందించి
                            పూcదేనెచెమటల బుజ్జగించి

          తొడలు ననcటికంబంబులు మెడలుఁ బోక
          బోదెలు నెలుంగులును బరపుష్టతతులు