పుట:Aandhrakavula-charitramu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

355

నా చ న సో ముఁ డు

అందందు నెఱ్ఱాప్రెగడ హరివంశములోవి పద్యము నొకదానిని సోముని హరివంశములోని పద్యము నొకదానిని తీసి పోల్చుటవలన నుభయ కవుల తారతమ్యమును తేటపడ నేరదు. కవిత్వతత్త్వమును మొత్తముమీఁద విచారింపవలెను. అప్పడు సహిత మభిప్రాయభేదముండక మానదు. ఒకరికి రుచించినది యింకొకరికి రుచింపదు. లోకోభిన్న రుచి యన్నది కొత్తది కాదు గదా. ఇతడు హరివంశముఁగాక పసంతవిలాసమను ప్రబంధమును నొకదానిని కూడ రచియించి యున్నాఁడఁట. [1] దానిలోని పద్యముల మూటి నీ క్రింద నుదాహరించుచున్నాను.

      క. అత్తఱి విటనాగరికులు
          చిత్తమున వసంతికేళి చిగురొత్తంగా
          మొత్తములు గట్టి తెచ్చిరి
          ముత్తెపుఝల్లరులతోడి బుఱ్ఱటకొమ్ముల్.

      క. అంజెదవుగాక ననుఁ జెం
          తల జేరఁగ నీక యెంతతగ్గిన మిరియా
          లుం జొన్నలసరిగావే
          లంజెతనమునందుఁ గొమిరెలం గెలువవొకో.

      శా. ప్రాలేయప్రతివీరసేనఁ బఱపెన్ బై పై వసంతం బిలన్
          గాలోన్మీలిత కోరకోదరపరాగ ప్రౌఢకోపాగ్నియై

  1. ['వసంత విలాసము' మాచయబ్రహ్మయ కంకితము చేయcబడినదని శ్రీమానపల్లి రామకృష్ణకవిగారు తెల్పినారు. యీ బ్రహ్మని శాసనమొకటి పల్నాడు తాలూకా లోని కారెమపూఁడిలో నున్నదని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తరహరివoశ పీఠికలో వ్రాసియున్నారు. ఈ మాచయబ్రహ్మనివిూcద కొన్ని చాటువులు కలవు. నాచనసోముని హరవిలాసములోనివని కస్తూరి రంగకవి రంగరాట్ఛందములో గొన్ని పద్యముల నుదాహరించినాఁడు. ఈ గ్రంథము హరవిలాసము కంటె భిన్నవెూ అభిన్నమో]