పుట:Aandhrakavula-charitramu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

341

హు ళ క్కి భా స్క రు డు

గూర్చిన సంబోధనములు గల పద్యము లీ రామాయణమున నుండుట కే ప్రమేయము గానరాదు. ఎన్ని విధములుగాఁ బరిశీలించి చూచినను ఆరణ్య కాండము తక్కిన భాగములకంటెఁ బూర్వము రచియింపఁబడి యుండు నని విదిత మగుచున్నది. అట్లయినయెడల ... ... సాహిణిమారుఁడు రామాయణము నంతయు విడిచి ముందుగా భాస్కరమహాకవిచే నారణ్యకాండము నంకితము పొందుట కేమి హేతువో తెలియరాదు " ఆని వ్రాసి, భాస్కర రామాయణమునుగూర్చి యథార్థకధనము నింకను బరిశీలింపవలసియున్నదని తేల్చిరి మల్లికార్జునభట్టు తన గద్యమునందు 'అష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవి పుత్ర మల్లికార్జునభట్ట ప్రణీతం బయిన ...'

అని స్పష్టముగా తాను భాస్కరసత్కవి పుత్రుఁడనని చెప్పకొనుచుండcగా కొడుకు తనతండ్రి కాశ్రయుఁడయి యున్న మారనకాలములో లేఁడన్న విపరీతాభిప్రాయము శ్రీవీరభద్రరావు పంతులుగారి కేల కలిగెనో దురూహ్యముగా నున్నది. మల్లికార్డున భట్టు తాను జేసిన రామాయణభాగమును రాజాజ్ఞచేతఁగాక తండ్రియిష్టమును బట్టియే చేసి యుండుటచేత స్వాభావికముగాఁ దన యిష్టదైవతమైన శివునినే సంబోధించి యున్నాడు. రాజున కాశ్రితుఁడును, విహితుఁడును నైన భాస్కరుఁడు రాజానుమతితో నా పద్యముల నట్టే యుంచి యుండవచ్చును. భాస్కరుఁ డాస్థానకవిగాను, మారన యశ్వసేనా నాయకఁడుగాను ప్రతాపరుద్రునియొద్దc గొలువుకుదిరియుండుట ప్రసిద్ధము. ఒక్క ముద్రితరామాయణమును మాత్రమే కాక పూర్వ లిఖితపుస్తకములనుగూడ పరిశీలించినచో పూర్వో క్తములయిన యనేకాంశములు తేటపడును. చెన్నపురిలోని దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో రామాయణములు 82, 83 సంఖ్యలు గలవియు, 138 మొదలుకొని 158 వఱకు సంఖ్యలు గలవియు, 24 తాళపత్ర లిఖితపుస్తకములు నున్నవి. కిష్కింధాకాండముచివర నొక పుస్తకములో మాత్రము భాన్కరునిగద్య మున్నది; ఇంకొక పుస్తకములో (143)