Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మారని సంబోధించిన పద్యమున్నను కాండాంతమునందలి పద్యములు రెండును శివుని సంబోధించునవిగా నున్న వనియు, అందుచేత మల్లికార్జున భట్టు రచియించిన భాగములు శిపుని కంకితము చేయఁబడినవి గావి సాహిణి మారన కంకితముచేయఁబడినవి కానట్టును సాహిణిమారనను గూర్చిన రెండు పద్యముల నెవ్వరో చాటువులుగాఁ జెప్పిన నిటీవలి లేఖకులు వానినిదెచ్చి వీనికి ముడిపెట్టినట్టును మల్లికార్జునభట్టు సాహీణిమారనకాలమువాడు కానట్టును నూహింపవలసియున్న" దనియు వ్రాసి, తరువాతఁ గుమార రుద్రదేవునిగూర్చి యతఁడు "తనభాగమును (అయోధ్యాకాండముమ) సాహిణిమారని కంకితముచేసినది వాస్తవ మనుటకు సందియములేదు గాని యతఁడు భాస్కర శిష్యుఁ డన్న మాట విశ్వసింపఁదగినదిగా గనుపట్ట" దనియు, "ఇంత విద్యావంతుఁడై న కుమారుఁడు కలిగి యుండియు సాహీణిమారc డీ రామాయణము నంతయు నీతనిచేతనే వ్రాయింపకుండుటకుం గారణంబు' లేదనియు, వ్రాసి, యటు పిమ్మట భాస్కరునిగూర్చి 'అరణ్యకాండము సాహిణి మారని కంకితము చేయఁబడియున్నది గాని రచనా విధాన మంతయు నన్నెచోడ, తిక్కనాది కవివరుల రచనావిధానక్రమమును బోలియున్నది" యనియు, "ఈ కాండమున నాశ్వాసవిభాగము చేయబడినది. అంతియగాక యీ కాండమునందలి ప్రధమ ద్వితీయాశ్వాసాంతపద్యములు కృతిపతినిగూర్చి సంబోధనములు గాక ప్రధమ ద్వితీయాంతములుగా నున్నవి. ఇట్టి మార్గమును తదితర కాండములను రచించిన కవులెవ్వరు నవలంబించి యుండలేదు" అనియు, వ్రాసి, అటుతరువాత నయ్యలార్యనిఁ గూర్చి యతఁడు 'యుద్ధకాండములో కొంత భాగము హుళక్కిభాస్కరుఁడు చెప్పెనని చెప్పెనేకాని హుళక్కిభాస్కరుఁడు తనకు మిత్రుడని యెక్కడను జెప్పి యుండలేదు. మఱియు యుద్ధకాండమునందలి పద్యములు శివుని సంబోధించునవిగా నున్నవి గనుక నితఁడు సాహిణిమారనికాలములోనివాఁడు కాఁడనుట నిశ్చయము అనియు వ్రాసి, కడపట రామాయణములో విశేషభాగము సాహిణిమారని మరణానంతరమే రచింపఁబడి యుండవలయును. అట్లుగాక యున్న శివునిం