342
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కుమారరుద్రదేవుని గద్య మున్నది. సుందరకాండముచివరను 82 సంఖ్య గల పుస్తకములో 'శ్రీమదష్టమభాషాకవిమిత్ర కులపవిత్రయశస్కర భాస్కరప్రణీతంబైన' యని యున్నది. ఈ ప్రకారముగానే 144, 148, 150, 151 సంఖ్యల పుస్తకములలోను భాస్కరునిగద్యమే యున్నది. ఈ పుస్తకములలో పద్యములు సహిత మనేకములు భిన్నములుగా నున్నవి. ఈ పద్య భేదములనుబట్టి పుస్తకములో నొక్కరికంటె నెక్కువమంది హస్తము తగిలినట్టు కనఁ బడుచున్నది. మల్లికార్డున భట్టున కిదియే నూతన కవిత్వ మగుటచేతఁ దన పాండిత్యప్రకర్షమును కనఁబఱుపవలె నన్న యుద్దేశముతోఁ గాఁబోలును సాంస్కృతికదీర్ఘ సమాసములు మొదలై నవానిని విశేషముగా వాడి యున్నాఁడు.
రెండవదియైన యయోధ్యాకాండము మారయకుమారుఁడై న కుమారరుద్ర దేవునిచే రచియింపబడిన ట్లున్నది అతనియాశ్వాసాంతగద్య మిది.
"సకలకళావిశారద శారదాముఖముకురాయమాణ సారస్వతభట్టబాణ నిశ్శంకవీర మారయకుమార కుమారరుద్రదేవ ప్రణీతంబైన......."
ఈ గద్యములోఁ దాను భాస్కరశిష్యుఁడనని చెప్పకపోయినను తన తండ్రికాశ్రిత కవియైన భాస్కరకవితోఁ గలిసి తన తండ్రి పేర రచియింపఁబడు చున్న రామాయణరచనలో దాను పాలుగొనుచుండుటయుc, దన పద్యములను భాస్కరునిచే సంస్కరింపించుకొనుచుండుటయు నాతనిశిష్యత్వమును చెప్పకయే చెప్పచున్నవి. కొన్ని వ్రాఁత పుస్తకములలో నీ కాండాంతము నందు భాస్కరుని గద్యమే యున్నది. పద్యములను పెక్కులు భిన్నములుగా నున్నవి. ఇది యంతయు భాస్కరుని హస్త మిందులోను దగిలి యున్నదని తెలుపుడుచేయుచున్నది. కుమారరుద్ర దేవుఁడు తరుణవయస్కుఁడైన రాజకుమారుఁ డగుటచేఁ దన స్తోత్రప్రియత్వమును నిశ్శంకవీర త్వమును గద్యములోఁ గొంత చూపుకొని యున్నాఁడు.
ఇది యుద్ధకాండములోని భాస్కరుని కడపటి పద్యము.
ఉ. "ఇంక బలీముఖుల్ బలిసి రెక్కడిరావణుఁ డేటిలంక పొం
డింకను మేఘనాథునగరీ పెనుమంటలతోడిచిచ్చుల