పుట:Aandhrakavula-charitramu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

287

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

        వృత్తి- ఆకారాంతా చ్చబ్దా త్పరస్య సుపః శ్లుబ్న భవతి వోల్ ప్రత్యయే,
                  వొల్ ప్రత్యయే చ పరే.

         ప్రయోగః- ఇంద్రనవోల్, ఇంద్రనవాల్; చంద్రనవోల్, చంద్రనవొల్.
                  వోల్పొవీతికిం ఇంద్రంబొల్, చంద్రంబొల్.

         వ్యాఖ్యా- తస్య తుల్యే వోల్వోల్వితి షష్ట్యంతా తౌ ప్రత్యయౌ విధాన్యేతే తయోః
                  పరయోః సుపః శ్లుబ్నినిషిధ్యతే- తత్రానకారాంతే విభాషయా
                  వక్ష్యమాణత్వాద యమకారాన్త ఏవ నిషేధ8 వర్యవస్యతీత్యాహ-
                  ఆకారాంతాదిత్యాది-పూర్వేణ శ్లుపః ప్రాప్తా వయ మారంభః.

అకలంకుఁడు తన శబ్దాను శాసనము నీ మంగళ శ్లోకముతో ముగించెను.

        శ్లో. "మంగళం భగవానర్హన్ మంగళం భగవాన్ జినః.
            మంగళం ప్రధమాచార్యో మంగళం వృషభేశ్వరః"

అకలంకుని శబ్దానుశాసనమునుగూర్చి యింత దూర మేమేమో చెప్పియు ముఖ్యముగాఁ జెప్పవలసినదానిని చెప్పకయే యుంటిమి. అతఁడు తన గ్రంధరచనకాలమును పుస్తకము తుద నిట్లు చెప్పెను.

         శ్లో. శకవర్షే రస నేత్ర బాణ శశి సంఖ్యేబ్దే తపోమాసికో
            భకృతి శ్రీసితపంచమీ గురు దినే లగ్నే ఘటే పౌష్ణ భే
            అకలంకాహ్వయయోగిశిష్యతిలకో గ్రంథం సతాం మంజరీ
            మకరందాఖ్య మిదం మతం వ్యరచయం భట్టాకలంకో మునిః

ఈ శ్లోకములో తాను మంజరీమకరందాఖ్యవ్యాఖ్యను శకవర్షములు 1525 (అనఁగా క్రీ. శ. 1604) శోభకృత్సంవత్సర మాఘశుద్ధ పంచమీ గురువార రేవతీనక్షత్ర కుంభలగ్నమున ముగించినట్టు భట్టాకలంకుఁడు చెప్పెను. అకలంకుఁడు కర్ణాటకశబ్దానుశాసనమును వ్యాఖ్యతోడఁగూడ 1604-వ సంవత్సరమునందు ముగించినందున, దానిని చదివి తన కారికలను రచించిన వికృతివివేకకారుఁడు తరువాత నేఁబది, యఱువది సంవత్సరముల కుండి