పుట:Aandhrakavula-charitramu.pdf/315

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

288

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యుండును.[1] ఇక ఈ కాల మహోబల పండితుని కాలముతో సరిపోవుచున్నది. ఈ కారికలవార్త నహోబలునికిఁ బూర్వమునం దున్నవా రెవ్వరు నెఱుఁగరు. పూర్వమందున్నవా రనుట యేమి ? ఏక కాలమునందే యున్న యప్పకవి సహితమెఱుఁగఁడు. అప్పకవిమీఁది స్పర్థ చేతఁ దన వాఖ్యాన మనఁగా నహోబలపండితీయ మనcబడెడు కవిశిరోభూషణ మప్పకవీయమున కంటె మిన్నగా నుండవలె నన్నయభిలాషతో నీ కారికావళిని రచించి తన వ్యాఖ్యానములోఁ జేర్చి యధర్వణాచార్యుని వని లోకమును భ్రమ పెట్టి నమ్మించి యుండె ననుటకు సందేహము లేదు. [2] కారికల నధర్వణుఁడే రచియించి యుండినయెడల

       "శ్రుతే౽పశబ్దే చోకే వా ప్రమాదాత్ పాణినిం స్మరేత్
        ప్రాకృతే షడ్విధే చాపి వాల్మీకిం వా మహేశ్వరం
        ధ్యాయే దత్రతు మామేవ స్మరే త్పండిత సమ్మతః."

ప్రమాదముచేత సంస్కృతమున నపశబ్దము నుచ్చరించినచో పాణినిని స్మరించవలసినట్లే యాంధ్రమున నపశబ్దము నుచ్చరించినచోఁ దన్నే (యధర్వణునే) స్మరింపవలయునని యింత యత్యధికముగా నాత్మ శ్లాఘనను జేసికొని యుండఁడు. ఈ కారికావళిని తాను రచియించి యుండుటచేతనే యహోబలపండితుఁడు

          "యస్సారో౽ధర్వణే గ్రంధే సోప్యత్రైవ విధీయతే
           తేన తత్పక్కికాలోకలోలతా త్యజ్యతే బుధైః"

అధర్వణుని గ్రంధములో సారభూతమైన దంతయు నిందే చేర్పఁబడి యుండుటచేత పండితు లా గ్రంధమును జూడవలెనన్న యభిలాషను విడిచిపెట్టవలయునని వ్రాసి యున్నాఁడు. గ్రంధ మంతయు నహోబలపండితీయములోనే యుండినప్పడు వేఱుగా గ్రంథమును జూడవలెనన్న

  1. [ఇట్లనుట సరి కాదనియు, అకలంకుడు ప్రాచీనుఁ డొకఁ డున్నాఁడనియు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు 'ప్రబంధ రత్నావళి' పీఠిక లో వ్రాసియున్నారు.]
  2. [వెనుక 5 వ పుటలోఁ జెప్పినదాని కిది విరుద్ధముగా నున్నది.]