286
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
జేసెననియు, నది పరమప్రమాణ మనియుఁ జెప్పి యున్నాడు. [1]ఈ యకలంకుఁడు జైనపండితుఁడు. ఈతఁ డకలంకుఁ డనియు, ఆకలంక భట్టనియు, భట్టాకలంకుఁడనియు, అకలంక దేవుఁడనియు గ్రంథముల యందు వాడఁబడుచున్నాఁడు. ఇతఁడు సంస్కృత సూత్రములతో "శబ్దాను శాసన" మనుపేర కన్నడ వ్యాకరణమును జేసి, దానికిఁ దానే "భాషా మంజరి" యను వృత్తిని మంజరీ మకరంద" మను వ్యాఖ్యానమును జేసి యున్నాఁడు. తాము చేసిన వ్యాకరణములకు శబ్దానుశాసనము లని పేరు పెట్టుటయు వానికిఁ దామే వృత్తులను వ్యాఖ్యానములను వ్రాయుటయు మొదటినుండియూ జైనపండితులలో నాచారమయి యున్నది. మొట్టమొదట సంస్కృత వ్యాకరణమును జేసిన శాకటాయనుఁడను జై_నపండితుఁడు తన వ్యాకరణమునకు "శబ్దానుశాసన" మను పేరు పెట్టి దాని "కమోఘవృ త్తి యను వృత్తిని జేసి యున్నాఁడు. తరువాత "హేమచంద్రుఁ డను జైనపండితుఁ డెనిమిది ప్రకరణములు గల "శబ్దశాసనము"ను సంస్కృత సూత్రములతో 1170-వ సంవత్సరమునందుఁ జేసెను. దానిలోని యెనిమిదవ ప్రకరణము ప్రాకృతమునుగూర్చినది. దానినే మనవారు హేమచంద్రఫక్కి యని చెప్పదురు. సంస్కృత ప్రాకృతము లాంధ్ర భాషకు ప్రకృతులగుటచేత నొక విధముగాఁ గొంతవఱకు సంస్కృత ప్రాకృత వ్యాకరణములను తెనుఁగులక్షణములనియుఁ జెప్పవచ్చును. శబ్దాను శాసన మన పేరితో సంస్కృతసూత్రములతో వ్యాకరణమును జేసిన మూఁడవ జైనపండితుఁడు భట్టాకలంకుఁడు. ఈ కర్ణాటకశబ్దానుశాసనము నాలుగు పాదములను ఏనూటతొంబదిరెండు సూత్రములను గల దయియున్నది. ఇందలి సూత్రము లాంధ్రశబ్దచింతామణిలోని సూత్రములను బోలి యుండును. వాని స్వరూపమును జూపుటకయి యొక్క సూత్రము నిందు వృత్తి వ్యాఖ్యానములతో నిచ్చుచున్నాను.
సూత్రము -249 ---నవోల్వొలి
- ↑ [దీనిచే ఆకలంకుడు చెప్పబడెనని కాని చెప్పబడినను కన్నడ వ్యాకరణ కర్త చెప్పఁబడెనని కాని చెప్పవలను పడదని కొందరందురు.]