పుట:Aandhrakavula-charitramu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

193

ఎ ఱ్ఱా ప్రె గ డ

     కం. ధీరుం డా గోవిందన
             కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
             క్ష్మారమణున కుదయించిన
             వీరుఁడు రాజేంద్రచోడవిభుప్రెగ్గడయై. 23
                                                               
         సీ. నవకోటిపరిమిత ద్రవిణ మే భూపాలు
                   భాండారమున నెప్డు బాయకుండు
             నేకోనశతదంతు లే రాజునగరిలో
                   నీలమేఘంబులలీలఁ గ్రాలు
             బలవేగ రేఖ నల్వదివేల తురగంబు
                   లే నరేంద్రువిపాగ నెపుడుఁ దిరుగుఁ
             బ్రతివాసరంబు డెబ్బదియేడుపుట్ల నే
                  యేవిధుమందల నెపుడుఁ గల్గు

             నట్టి యధిక విభవుఁ డగు కులో త్తుంగరా
             జేంద్రచోడనృపతి కిష్ట సచివ
             తంత్రముఖ్యుఁ డనుఁగు మంత్రి గోవిందనం
             దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పు. 24

         ఉ. ఇల వెలనాటిచోడమనుజేంద్రునమాత్యత యానవాలుగాఁ
             గులతిలకంబుగా మనిన కొమ్మనప్రెగ్గడకీర్తి మాటలం
             దెలుపఁగ నేల ? తత్క్రియఁ బ్రతిష్టితమైన తటాక దేవతా
             నిలయమహాగ్రహారతతి నేఁటికి నెల్లెడఁ దాన చెప్పఁగన్ 25

ఆ కాలమునందు నియోగులు రాజులకడ మంత్రులుగా నుండుటయేకాక ఖడ్గతిక్కనవలె దండనాథులుగాc కూడ నుండి శత్రురాజులతో యుద్ధములు సహితము చేయుచుండిరి. ఈ కొమ్మనామాత్యునిఁ గూర్చి కేయూరబాహుచరిత్రములో వ్రాయబడినదానిని చూడుఁడు.