పుట:Aandhrakavula-charitramu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

తి క్క న సో మ యా జి

యనియు, సేనా నాయకుఁడుగా నుండిన యాతని తమ్ముఁడు ఖడ్గతిక్కన యనియు, ప్రసిద్ధి చెందినట్టు చెప్పదురుగాని పూర్వోదాహృతపద్యములను బట్టి తిక్కన లిరువురే యైనట్టు స్పష్టపడుచున్నది. తిక్కనసోమయాజికొమారుఁడు కొమ్మన్న. తిక్కనసోమయాజి సూర్య వంశపుపరాజై నెల్లూరిమండలమున కధినాఁధుడు గా నుండిన మనుమసిద్దికడ నాస్థానకవిగా నుండినను, ఆ రాజునకాశ్రితునివలె నుండక యాతనిచే సమానుఁడుగాఁ జూడఁబడి గౌరవింపఁబడుచుండెను. రాజునకును, కవికిని మామ వరుస ఈ కవీంద్రుఁడు రచియించిన నిర్వచనోత్తరరామాయణము కృతి నందిన మనుమభూపాలుడు

     క. "ఏ నిన్ను మామ యనియెడు
         దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
         కీ నర్హుఁడ వగు దనినను
         భూనాయకుపలుకు చిత్తమున కిం పగుడున్ "

"నిన్ను మామా ! యని పిలుచుచున్నందునకై భారతీకన్యను నాకిమ్మని యడిగినట్లు చెప్పఁబడి యున్నది. తిక్కన నిర్వచనోత్తరరామాయణము నందు నన్నపార్యుని పూర్వకవిని గా వర్ణింపలేదు. అనంతరమున రచియించిన భారతమునందైనను,

    ఉ. ఆదరణీయసారవివిధార్థగతి స్ఫురణంబు గల్గి య
         ష్టాదశపర్వనిర్వహణసంభృతమై పెనుపొంది యుండు నం
         దాది దొడంగి మూఁడు కృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి
         ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

ఆంధ్రకవితావిశారదుండైన నన్నయభట్టు మొదటి మూఁడు పర్వములను తెనిఁగించెనని చెప్పెనేకాని యాతని నాదికవినిగాఁ జెప్పి స్తుతింపలేదు. ఆందుచేతఁ దిక్కన నన్నయభట్టారకుని నూత్నకవినిగాఁ బరిగణించినట్టు స్పష్టమగుచున్నది. ఇది యిట్లుండఁగా నిర్వచనోత్తరరామాయణమునందు