పుట:Aandhrakavula-charitramu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

     చ.'హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్న సత్కవీ
         శ్వరులను భక్తిఁ గొల్చి మఱి వారి కృపన్ గవితావిలాసవి
         స్తరమహనీయుఁడైన నను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
         వరుఁడు తగంగ రాcబనిచి వారని మన్నన నాదరించుచున్.'

అని యాదికవీంద్రులను, నూత్నకవీంద్రులను స్తుతించుటచేత నన్నయాదు లకు బూర్వమునందుఁ గూడ నాంధ్రకవీంద్రు అనేకులున్నట్టు స్పష్టపడుచున్నది.*

తిక్కన రచియించిన తెనుఁగుకావ్యములు రెండు, అందు మొదటిది నిర్వచనో త్తరరామాయణము. ఈ గ్రంధము రచించునప్పటి కీతఁడు యజ్ఞము చేయలేదు. తక్కిన తెనుఁగు పుస్తకములవలెఁ గాక రఘువంశాది సంస్కృత కావ్యములవలె దీని నీ కవి నడుమ నడుమ వచనము లుంచక సర్వమును పద్యములుగానే రచించెను. ఈతcడు రచించిన భారతమువలె నీ యుత్తర రామాయణ మంత రసవంతముగాను, బ్రౌఢముగాను లేకపోయినను, పద వాక్య సౌష్టవము కలిగి మొత్తముమీఁద సరసముగానే యున్నది. ఇది బాల్యమునందు రచియింపఁబడిన దగుటచే నిట్లుండి యుండును. ఈ గ్రంధమునందు పదకాఠిన్య మంతగా లేకపోయినను, బహుస్థలములయం దన్వయ కాఠిన్యము గలదు. ఇందలి కధ సంస్కృతములో నున్నంత లేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడినది. శైలి పలుచోట్ల నారికేళపాకమనియే చెప్పవచ్చును. అందుచేతనే యీ గ్రంధము భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. ఇతఁడు పది యాశ్వాసములగ్రంధమును వ్రాసినను పుస్తకమునుమాత్రము ముగింపలేదు. రామనిర్యాణ కధను చెప్పట కిష్టము లేక గ్రంధపూర్తి చేయలేదని పెద్దలు చెప్పదురు. రామనిర్యాణకధను జెప్పుటకు భీతిల్లి దానిని వదలిపెట్టినయెడల, తిక్కన భారతమునందు స్త్రీపర్వకధయు, కృష్ణనిర్యాణమును జెప్పుట కేల భయపడలేదని యొకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతిమరణకధకును భయపడి దానిని విడుచుచు __________________________________________________________________________ * ఈకవులు తెలుఁగు కవులని నిశ్చయింప నాధారములులేవు. సంస్కృత కవులైన గావచ్చును. సంస్కృతకవులనుగూడ నాంధ్రకవులు స్తుతించుట పరిపాటి.