Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

తిక్కన తాను రచియించిన నిర్వచనోత్తర రామాయణమునందు:

      గీ. "సారకవితాభిరాము గుంటూరివిధుని
           మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలంచి
           యైన మన్నన మెయి లోక మాదరించు
           వేఱ నా కృతిగుణములు వేయునేల ?

అని తన కావ్యము స్వగుణముచేతఁ గాకపోయినను తన తాత యైన మంత్రి భాస్కరునిసారకవిత్వమహిమచేత నయినను లోకాదరణమునకు పాత్ర మగునవి చెప్పియున్నాఁడు. మంత్రిభాస్కరుని వితరణాదులను గుఱిించి కవులు పెక్కండ్రు పెక్కు- పద్యములను జెప్పి యున్నారు. వితరణమును గూర్చి ప్రసిద్దు డయిన మంత్రిభాస్కరుఁడు రాయనభాస్కరుఁడు. ఈ క్రింది చాటువు రామయామాత్యభాస్కరుని ప్రఖ్యాతిని జెప్పు నదియె యైనను మనోహరముగా నుండుటచే నిందుc జేర్పఁబడినది

    మ. 'సరి బేసై రిపు డేల భాస్కరులు ! భాషానాధపుత్రా ! వసుం
         ధరయం దొక్క-cడు మంత్రియయ్యె వినుకొండన్, రామయామాత్యభా
         స్కరుండో, యౌ, నయినన్ సహస్రకర శాఖల్లే, వవే యున్నవే
         తిరమై దానము చేయుచో రిపుల హేతిన్వ్రేయుచో వ్రాయచోన్.'

                                                   రావిపాటి తిప్పరాజు

ఈ కవిపూర్వులు లౌకికాధికారధూర్వహులగుటయే కాక యీతనిది పండిత వంశ మనియు నిందువల్ల తేటపడుచున్నది. ఈయన తండ్రి యయిన కొమ్మన్న శివలీలావిలాస మను గ్రంధమును రచించినట్టు చెప్పుచున్నారు. శివలీలావిలాసమును రచియించిన కొమ్మన్న తిక్కనసోమయాజుల తండ్రి శ్రీనాధునికాలములో రాజమహేంద్రవరమును పాలించుచుండిన వీరభద్రారెడ్డియెుక్క తమ్ముఁడైన దొడ్డభూపతికిఁ దన పుస్తకము నంకిత మొనర్చిన నిశ్శంక కొమ్మనామాత్యుఁడని యిటీవల లభించిన యా పుస్తకమునుబట్టి తెలియుచున్నది. నెల్లూరికి రాజయిన మనుమనృపాలుని యాస్థానకవీశ్వరుఁడుగా నుండిన యీతఁడు కవితిక్కన యనియు, ఆ రాజు కడ మంత్రిగా నుండిన యీతని పెదతండ్రి పెద్దకుమారుఁడు కార్యతిక్కన