పుట:Aandhrakavula-charitramu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

151

తి క్క న సో మ యా జి

తండ్రితాతలు రాజాస్థానములయందు గొప్పకొలువలు చేసి ప్రభుసమ్మా నము బొంది మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవారు. కవితండ్రి యైన కొమ్మన మంత్రి కృష్ణా మండలములోని గుంటూరునకు దండనాధుడయి యుండెను. తాతయైన భాస్కరుఁడు గుంటూరి కధిపతిగా సుండి విద్యలయం దసమానుఁడయి మంత్రిభాస్కరుండని విఖ్యాతి కెక్కెను. మొట్టమొదటి రామాయణమును పద్యకావ్యమునుగా తెనిఁగించిన మహాకవి యితఁడే యని చెప్పుదురు. ఆ గ్రంధ మీయనపేరనే భాస్కరరామాయణమని నేఁటివఱకును ప్రసిద్ధి చెందుచున్నదనియుఁ జెప్పుదురు ఇప్పడున్న భాస్క_రరామాయణమున కాపేరు హుళక్కి భాస్కరునివలననే కలిగినదిగాని మంతిభాస్కరునివలనఁ గలిగినదిగా కనఁబడదు *

రామాయణ మంతకు ముందు రచియింపఁబడి యుండుటచేతనే తిక్కన సోమయాజి రామాయణముయెుక్క యుత్తరకాండమును తెనిఁగింప నారంభించె ననియు పోతరాజకృతభాగవతములోని కొన్ని భాగము లాతని యనంతర మన నుత్పన్నము లయి పోఁగా పోయిన భాగములను వెలిగండల నారాయణాదులు పూరించినట్లే, భాస్కరవిరచితరామాయణముసహిత మొక్కయారణ్యకాండము తక్క తక్కినభాగములు కొంతకాలమున కుత్స్ననములు కాఁగా మిగిలినకాండములను హుళక్కి భాస్కరాదులు పూరించిరనియు కొందఱందురు. కాని యీ యంశమును స్థాపించుటకు నిర్పాధకము లైన యాధారము లేవియుఁ గానరావు. ఈ మంత్రిభాస్కరుఁడు రామాయణమును రచియించి యుండినయెడల, తిక్కన తన నిర్వచనోత్తరరామాయణమునం దా మాట నేల చెప్పియుండఁడు ? ఇది ఇంకను విమర్శనీయ మయిన వివాదాంశము. ** __________________________________________________________________________ [ * మంత్రిభాస్కరుఁడు" అను శీర్షిక క్రింద నీవిషయము చర్చింపcబడినది. మంత్రిభాస్కరునిఁబట్టియు 'భాస్క_ర రామాయణ' మను పేరు కలఁగవచ్చును.] [ ** ఇందలి 'మంత్రిభాస్కరుఁడు , హుళక్కి, భాస్కరుడు’ అను శీర్షికలలోని విషయములను గమనించునది.]