150
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
ఈ పద్యములలో స్పష్టముగాఁ జెప్పకపోయినను దిక్కన రామాయణాది గ్రంథములను జేసినట్టును, క్రతువులు చేసినట్టును గవి సూచించియున్నాఁడు. దశకుమారచరిత్రమును కృతి నందునప్పటికి తిక్కన భారతరచన మారంభించి యుండడు; కేతన యెక్కడను తిక్కన్నను సోమయాజి యని చెప్పి యుండకపోవుటచేత నతఁ డప్పటికి యజ్ఞము సహితము చేసియుండఁడు. ఆధానమును జేసి యుండునేమో ! తిక్కన్నే మనుమసిద్ధిమంత్రిగా నుండి సంపదలతోఁ దులదూగుచున్న కాలముననే కేతన యాతనికి దశకుమార చరిత్రము నంకితము చేసెను. మఱియు నీతని వంశాభివర్ణనమునుబట్టి ముగ్గురు తిక్కనలు లే రనియుఁ గవితిక్కనయే మంత్రితిక్కన యనియు రణతిక్కన యనియు ఖడ్గతిక్కన యనియుఁ జెప్పఁబడునతఁడు కవితిక్కనకుఁ బితృవ్యపుత్రుఁడనియు స్పష్టపడినది.
కొమ్మన్ననుండి యాతని సంతతివారు పాటూరివా రయినారు.ఈ తిక్కన కవి గౌతమగోత్రుఁడు.ఈతని తండ్రి కొమ్మన; తల్లి అన్నమ్మ,కేతన,మల్లన,సిద్దన అనువా రీతని పెదతండ్రులు.*ఈ కవిగ్రామణి యొక్క __________________________________________________________________________
* సీ. మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబాపతి యనఘులు కేతన
మల్లన సిద్ధ నామాత్యవరుల
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ
మ్మనదండనాధుఁడు మధురకీర్తి
విస్తరస్ఫారుఁడాస్తంభసూత్రప
విత్రశీలుఁడు సాంగవేద వేది
యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల
నస్మదీయ ప్రణామంబు లాదరించి
తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి
యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు --విరాటపర్వము.
మ. అమలోదా త్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాప స్తంభనూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్
--నిర్వచనోత్తర రామాయణము.