పుట:Aandhrakavula-charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రాఁడువార మయితి' ముని హేళనముగా బలికినట్లును, నందుపయి నాతనికి రోషము పెచ్చి మరల యుద్ధమునకుఁ బోయి వీరమరణము నొందినట్లును, పయి చరిత్రమునందే చెప్పఁబడి యున్నది. ఆ పుస్తకమునందలి కొన్ని పద్యములు నిం దుదాహరించుచున్నాను --

       సీ. వీరనికాయంబు వేదనినాదంబుఁ
                బాయక యేప్రొద్దు మ్రోయుచుండు
          భూసుర ప్రకరంబు సేనలు చల్లంగఁ
                బాయ కెన్నియొ కుటుంబములు బ్రదుకు
          బ్రాహ్మణావళికి ధారలు పోసిన జలంబు
                సతతంబు ముంగిట జాలువాఱు
          రిపుల కొసఁగిన పత్రికల పుత్రికలను
                బాయక కరణముల్ వ్రాయుచుంద్రు

          మానఘనుఁడైన తిక్కనమంత్రియింట
          మదనసముఁడైన తిక్కనమంత్రియింట
          మహీతయశుఁడైన తిక్కనమంత్రియింట
          మంత్రిమణి యైన తిక్కనమంత్రియింట.
           * * * *
      క. పగఱకు వెన్నిచ్చినచో
         నగరే నిను మగతనంపు నాయకులందున్
         ముగు రాఁడువార మైతిమి
         వగ పేటికి జలక మాడ వచ్చినచోటన్.*

__________________________________________________________________________

*రణతిక్కన స్నానమునకు వచ్చినప్పడు భార్య స్త్రీలకు పెట్టినట్లుగా రహస్యస్థలమున నీళ్ళబిందె యుంచి దానికి నులకమంచము చాటుపెట్టి దానిమీఁద పసుపుముద్ద కుంచె ననియు, అది చూచి యతఁడు వ్యసనపడుచుండగా భార్య యీమాటలనియె ననియు చెప్పుదురు.