Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

119

తి క్క న సో మ యా జి

కాటమరాజును గూడఁ బ్రాణములు గోలుపోయినట్లు కాటమరాజకధ వలనఁ దెలియ వచ్చు చున్నది. [కాటమరాజునకును, మనుమసిద్దిరాజునకును జరగిన యుద్దమును గూర్చి యీ క్రింది విషయమును చెప్పుట గలదు.

కనిగిరిసీమలోని ఎఱ్ఱగడ్డపాటి ప్రభువు కాటమరాజు కఱవుల కారణమున తమ పశువులబీడులు ఎండిపోఁగా, మనుమసిద్దిరాజు పాలనలోనున్న బీడులలో తమ పశువులను మేతకు విడిచి, కొంతపుల్లరిని చెల్లించుట కంగీకరించెను కాని కాటమరాజు మనుమసిద్ధికి పుల్లరినీయక ఎదిరింపఁగా యుద్దము సంభవించెను. కాటమరాజు పల్నాటి ప్రభువుకాcడు.

కాటమరాజు పుల్లరి నీయకుండుటకుఁ గారణమును కొందఱిిట్లు చెప్పదురు.'మనుమసిద్ధి యుంపుడుకత్తె పెంచుచున్న చిలుక యొకటి పంజరమునుండి తప్పించుకొనిపోయి కాటమరాజు పశువులు మేయుచున్న యడవికేఁగి మనుష్యులవలె మాటలాడుచుండఁగా పశువులు బెదరి చెదరి మేఁతను మానినవcట! పశువులకాపరులు చిలుకను చంపివేయఁగా, సిద్ధిరాజు మనుష్యులా పసులకాపరులను చీకాకుపఱచిరcట! ఆ కారణముననే కాటమరాజు పుల్లరినీయక యుద్ధమునకు సిద్ధపడెనఁట!

యుద్దములో పల్నాటి ప్రభువైన పద్మనాయకుడు మున్నగువారు కాటమరాజునకు సాయపడిరcట!] ఈ యుద్ధములోఁ దిక్కనసోమయాజికి (పెద తండ్రి సిద్ధనకుమారుఁడు) సహోదరుఁడైన ఖడ్గతిక్కన సేనానియై యుండి సేనలను నడిపినట్లును, ఆ యుద్ధములో నతఁడు ప్రాణములు కోలుపోయి నట్టును ఖడ్లతిక్కన చరిత్రమువలన విదిత మగుచున్నది. మొదట నీ రణతిక్కన శత్రువుల కోడి పాఱివచ్చినట్లును, అప్పుడా తనితల్లి, యాతనిని జూచి కోపపడి కోడలితో 'నీవును నీ భర్తయు నేనును మనయింట ముగ్గు