పుట:Aandhrakavula-charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీ ఠి క

నే నీకవుల చరిత్రమును వ్రాసి ప్రకటించి యిప్పటికి ముప్పది సంవత్సరములు దాఁటి పోయినది. "నేనప్పటికి దొరికిన సాధనకలాపముతో కవులకాలనిర్ణయాదులను జేయుచు నేదో యొక రీతిని గ్రంథము సాంతముచేసితిని. ఇప్పటివలె నప్పడు గ్రంధాలయములు లేవు; ఇప్పడు ముద్రింపఁబడి యెల్లవారికిని సుసాధ్యము లయి యున్నగ్రంథములలో నూఱులకొలఁది కాకపోయినను పదులకొలఁది యైనను తెలుcగుగ్రంథములప్పుడము ద్రితము లయి తాళపత్రైకశరణ్యములయి దుస్సాధ్యములయి యుండెను; ఇప్పడు ప్రకటింపcబడియున్న శిలాతామ్ర శాసనాదులలో ననేకము లప్పుడు ప్రకటింపఁబడకుండెను. ఇట్టిస్థితిలో కవుల చరిత్రమును వ్రాయుట యప్పుడెంతకష్ట కార్యముగా నుండునో చెప్పనక్కఱలేకయే బుద్ధిమంతులూహించుకోవచ్చును. అయినను నేను వ్యయప్రయాసములకు వెనుదీయక పుస్తక సంపాదనమునకయి చెన్నపురి తంజాపురి మొదలయిన దూరప్రదేశములకు సహిత మరిగి యిచ్చినవారియొద్దనుండి తాళపత్ర పుస్తకములను సంపాదించియుఁ గొన్నిటికి మాతృకలకు పుత్రికలు వ్రాయించియు నియ్యనివారికడ జీర్ణతాళపత్ర పుస్తకముల నెరవుగాఁ గొని చదివి వానినుండి కావలసిన చరిత్రాంశములను వ్రాసికొనియు నెలలకొలఁది చెన్నపట్టణములో సుండి యచ్చటి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున కనుదినమును బోయి యందలి పుస్తకముల నెల్లఁ బరిశోధించి వానిలోనుండి యావశ్యక భాగములను వ్రాసికొనియు శక్తి వంచన లేక పాటుపడి నా కప్పటికి లభించిన పరికరసాహాయ్యమున నాంధ్రకవులను గూర్చి యేదో తోఁచినదానిని వ్రాసి ప్రకటించి కవులచరిత్రమనిపించితిని. క్రొత్తగా పూనుకొని పనిచేయుట కష్టము; చేసినదానిలో తప్పులు పట్టుట సులభము. నేను వ్రాసిన దానిలో తప్పులు కుప్పలుగాఁ గలవని నే నెఱుఁగుదును; బహుస్థలముల యందు మార్పులు చేయుట యావశ్యకమనియు నే నెఱుఁగని వాఁడను గాను. అయినను నాకంతకంతకు వృద్ధత్వమునకు తోడు వ్యాధి బాధలును శరీర దౌర్బల్యములును గూడ హెచ్చగుచు వచ్చుటచేత నేమి చేయుటకును శక్తుఁడను గాక పోయితిని. అందుచేత నేను పుస్తక మును మరలముద్రింపవలసివచ్చినప్పడు మార్పులు చేయుట మాట యటుండఁగాప్రూఫులు దిద్దుటకు సహితము సమర్థుఁడను గాక సమస్తమునకును ముద్రాశాలవారినేనమ్మి పుస్తకము నున్న దాని నున్నట్టగానే పలుతడవలు ముద్రింపింపవలసినవాఁడ నయితిని. ఇఁక నేను పుస్తకమును సవరింపఁగలుగుదు నన్న యాశను చిరకాలము క్రిందటనే వదలుకొని నిరాశతో నాయెద్ద నప్పటి కుండిన