పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‌ TELUGU PROVERBS--SUPPLEMENT

2306. గాజుపూసల గనిలో ఘనమయిన మణి కలుగునా.

Will a large gem be found in a crystal bead mine?

2307. గాడిద గాడిదే, గుర్రము గుర్రమే.

An ass is an ass, a horse is a horse.

                  (see No.1494)

2308. గాలి వచ్చినప్పుడుగదా తూర్పార పట్టుకోవలెను.

Is it not when the wind blows that you must winnow?

                      (See Nos.316,506,1169.)
            Strike while the iron is hot.
         Take time while time is, for time will away.

2309. గుడ్డివాడికి గుడ్డివాడు దారి చూపితే, యిద్దరూ గోతిలో పడతారు.

If a blind man lead a blind man, both will fall into the pit.

2310. గుడ్డివాడు కన్ను రాగోరునా, పోగోరునా.

Will a blind man wish to have an eye or not to have one?

2311. గుద్దులాడిన యింట్లో గుప్పెడు గింజలు నిలవవు.

In a quarrelsome family not a handful of grain will left.

2312. గురికి జానెడు యెచ్చు తక్కువగా కాల్చేవాడు.

A man who misses the mark by a span.

                    A bad shot.

2313. గురువుకు తగ్గ శిష్యుడు.

A diciple worthy of his Guru.

              Both blackheads
                                 (29)