పుట:ASHOKUDU.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

అ శో కుఁ డు

చేయనారంభించెను. ఈవిధముగ నాతఁడు చాల కాలము నానా స్థానములయందు నానా రీతుల బుద్ధధర్మ ప్రశాంతవచనములను ధర్మాసక్తులగు స్త్రీ పురుషుల కందఱకును బోధింప సాగెను.

ఉపగుప్తునికీర్తి నలుదెసల వ్యాపించెను. అతనిపుణ్యప్రసన్న ముఖమండలము పూర్ణిమా చంద్రునివలె లోకులకు మనో మోహన మగుచుండెను. ఆతనిపవిత్రముఖోద్గత యగు వాణి యమృత స్వరూపిణియై యుఁ డెను. సంచార సమయమునం దాతనియశ స్సౌరభ మాతనికంటే ముందుగానే ప్రయాణము చేయుచుండెను. అందువలన ముగ్ధులై యాతని యపూర్వపుణ్యమూర్తిని దర్శించుటకును, నాతని పవిత్రోపదేశముల వినుటకును జనులందఱును గుంపులు గుంపులుగ వచ్చి యాతని నెదురుకొనుచుండిరి. ఒకప్పు డాతఁడు మధురానగరమునకుఁ బోయినప్పు డీవిధముగ జనసంఘము, లాతని వెదురుకొనుట తటస్థించెను. అప్పు డాతఁడు విశాల రాజమార్గమున సకలజనాగ్రవర్తియై నడచుచుండెను. ఉభయ పార్శ్వములయందలి గృహగవాక్షములనుండియు నా బాల వృద్ధజనంబులు పరమానందముతో నాతనిం దర్శించుచుండిరి; తమశక్తికొలఁది నాతని బ్రశంసించుచుండిరి; ప్రణామము లాచరించుచుండిరి. కాని జగతియం దెల్ల వారి యభిరుచులు నొక్క టేరీతిగ నుండఁబోవు, అట్లే కానిచో నవ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/92&oldid=334769" నుండి వెలికితీశారు