పుట:ASHOKUDU.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

85

ఘనశ్యాముఁడును జటావల్కలధారియు నగు శ్రీరామ చంద్రమూర్తి పవిత్రమనోహర కాంతిం జూచి పాపాత్ము రాలగుశూర్పణఖ చిత్తవిభ్రాంతిగాంచుట యెందులకు ?మధురానగర రాజ మార్గమున శ్రీనిధియగు నుపగుప్తునిం జూచి రూపయౌవన సంపన్నయు, నతృప్తహృదయము, నగువాసవదత్తయనుపణ్య కాంత వికలచిత్త యయ్యెను, యువతియగు నామె స్త్రీ జనసులభంబగు సిగ్గును విడిచి యుపగుప్తు నియొద్దకుఁ దన యభిమతముం దెలుపుచు నొకదూతిక నంపెను. ఉపగుప్తుఁడాదూతి నిర్బంధవచనములను మన్నింప లేదు. దూతి చెప్పవలసిన దంతయును జెప్పెను. ఆతఁడు ధర్మాచార్యుఁడు, లోకమును బాపపథమునుండి మరలించుటయేకదా యాతనివిధాయక కృత్యము ? అయినను నాతడామెయొద్దకుఁబోయి బోధింప లేదు. అరివర్గముల కుతంత్రములం బడిపోయినవాఁ డాప్తవాక్యముల నెట్లు లక్ష్యము చేయఁగలుగును ? మంచిసమయమున బోధింపవలయు నని ధర్మాచార్యుడు నిరీక్షించుచుండెను. కొంతకాలము జరగి పోయినది.

ఆయువతీమణి యా నగరమునఁ దన సౌందర్యసంపత్తిని యథాపూర్వకముగ నే విక్రయించుచుండెను. ఒకప్పుడు ధనవంతుఁ డగునొక యువకుఁడు రత్నాలంకార భూషితుఁడై యానందమునఁ గాలక్షేపము చేయవలయునని యామె యింటికి వచ్చెను. అప్పుడా వేశ్య నియమిత ద్రవ్యముతోఁ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/93&oldid=334770" నుండి వెలికితీశారు