పుట:ASHOKUDU.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

83

జల పూర్ణకలశమున నిక్షేపించుచుండుము. అనంతరముదయమున నాజలమును దీసి వైచి యందున్న శిలాఖండములను వర్ణానుసారముగ విభాగము చేసి చూచుచుండుము. ఇట్లు చేయుచుండుటవలన నేమి ఫలము లభియించునో యాసంగతి నాకు నిర్దిష్టదినమునం దెఱింగింపుము.” అని యుపదేశించెను.

ఉపగుప్తుఁడు సనవాసుని యాజ్ఞానుసారముగఁ బ్రవర్తింపఁ దొడంగెను. మొట్ట మొదటఁ గొన్ని దినములవఱకు నీలశిలా ఖండసంఖ్య యధికముగఁ గానవ చ్చెను. అనంతరము గ్రమక్రమముగ నాసంఖ్య తగ్గిపోవనారంభించెను. తుదకన్నియును శ్వేతోపలఖండములే యయ్యెను. యువకునియానందమునకుఁ బరిమితి లేక పోయెను. అప్పు డుపగుప్తుఁడు సనవాసుని దర్శించి యెల్ల సంగతులును మనవి చేసెను. ఈ యువకునకుఁ జిత్తశుద్ధి యయ్యేనని సనవాసుఁడు గ్రహించెను. అనంతరము సనవాసుఁ డాయుపగుప్తుని దనశిష్యునిగఁ జేసికొని యథావిధిగ ధర్మోపదేశములఁ జేయుచుండెను; సావధానముగ ననేక రహస్య ధర్మముల నాతనికి బోధించెను; సర్వసిద్ధుల నాతఁడు గ్రహించునట్లు చేసెను. ఉపగుప్తుఁ డచిర కాలమునందే బౌద్ధులందఱలోనను సిద్ధపురుషుఁడను ప్రతిష్టా లాభమును బొందెను; పూజా ప్రశంసాపాత్రుఁడయ్యెను. కొంత కాలమునకు సనవాసుఁడు పరమసిద్ధి నందుటచే నాతని సింహాసనమున కుపగుప్తుఁ డధికారియై బుద్ధధర్మ ప్రచారము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/91&oldid=334768" నుండి వెలికితీశారు