పుట:ASHOKUDU.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

అ శో కుఁ డు

కుల నేడుదినముల వఱకు, నంధకారగృహమున మృత్తికా నిమ్న భాగమునందుంచి పరీక్షించుచుండెనని తెలియవచ్చు చున్నది. అయవరోధానంతరమునం దెవ్వఁడు నిశ్చలహృదయముతోఁ దనయుప దేశముల నే యాకాంక్షించునో యట్టి వానినే యాతఁడు తనశిష్యునిగా గ్రహించుచుండెనఁట! అన్ని సంగతులును నేర్చి కొనుట కందఱును సమర్థులు కారు. అందుచేత నెవ్వఁ డే విషయమును గ్రహించుట కుపయు క్తుఁడో యాసంగతిని బరీక్షించి నిశ్చయించుట యుప దేశకునకుఁ బ్రథమక ర్తవ్యము, ఎవ్వని కన్నులయం దశ్రువులును, సర్వాంగకముల బులకలును లేకుండునో యట్టివాఁడు భక్తిమార్గమునఁ బథికుఁడుగానుండట కర్హుఁడు కాఁడు. ఏమైననేమి ! బౌద్ధాచార్యుఁడగు సనవాసుఁడౌ యుపగుప్తుని శిష్యునిగా గ్రహించి " ఓ కుమారా! మనుష్యహృదయ మాకాశము వంటిది. ఈయా కాశమున వివిధ హృదయ భావములనుండి చింతా మేఘము లుత్పన్నము లగుచున్నవి. ఈ మేఘములు విశేషసమయములలోఁ గృష్ణవర్ణము లై యుండును. మఱియు వీనిలో న నేకములు నిర్మలములును, ధవళములునై యుండును. నీవు కొంత కాలము వఱకు నిర్జనస్థలమున నివసించి యుండుము. ఎదుట నొక యుదక కలశము నుంచుకొని నీల శ్వేత వర్ణంబులగు కొన్ని శిలాఖండములను సంగ్రహించియుంచుము. నీ హృదయాకాశమున నెప్పు డెట్టిరంగుగలఁ జింతా మేఘ మగ పడునో యట్టిసమయమున నట్టిరంగుగల యుపల ఖండమును

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/90&oldid=334767" నుండి వెలికితీశారు