పుట:ASHOKUDU.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

81

యాధర్మాచార్యుని పుణ్యకథా ప్రసంగములంగూర్చి యాలోచించుకొని మనముకూడ ధన్యుల మగుదము — ఉపగుప్తుఁడు కాశీ నివాసియు, సుగంధ ద్రవ్య విక్రేత యునగు గుప్తుని తనయుఁడు. పదు నేడు సంవత్సరముల యీడుననే యాతని మతాసక్తి యతి ప్రబలమయ్యెను. ధర్మముకొఱకును, సద్గురు లాభముకొఱకును నాతఁడు దేశదేశములఁ దిరిగి తిరిగి తుదకుఁ జంపానగరమునకు వచ్చెను. ఆ సమయమునందచ్చట శాస్త్రజ్ఞుఁడును, భక్తుఁడును, నగు సన వాసుఁ డను పేరుగల బౌద్ధమ తాచార్యుఁడు వాసము చేయుచుండెను. ఉపగుప్తుఁ డా మహాత్ముని దర్శించి తన యభిమతమును దెలియఁ జేసెను.

ఆ బౌద్ధగురుఁ డాయువకుని యసామాన్య ప్రతిభావంతము లగు ముఖలక్షణములం గనుప ట్టెను. అతని సకలాంగకములం గల శుభలక్షణములను గ్రహియించెను; ఆతని దన శిష్యునిగాఁ జేసికొనుటకు స్థిరపఱచుకొ నెయెను. కాని, యాయువకుని యుద్దేశమునందలి దృఢత్వమును, మనఃపరితాపమును బరీక్ష్మించుట యావశ్యకమని యోచించుకొనియెను. ఇట్లు శిష్యులను బరీక్షించుట ప్రాచీన కాలమునందు యితర దేశములయందుఁగూడఁ బ్రచార మునం దుండెను. ప్రాచీన గ్రీసు దేశమ తాచార్యుఁడగు “పిథా గోరణ” అను నతఁడు తనయుప దేశముం గోరివచ్చిన యువ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/89&oldid=334766" నుండి వెలికితీశారు