పుట:ASHOKUDU.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

అ శో కుఁ డు

పుణ్యతీర్థములుగఁ బరిణమించినవో యాస్థానములను దర్శింపవలయునని వారిరువురును బ్రప్రథమున నుద్యుక్తులైరి. చతుస్సముద్ర ముద్రితమును, హిమాచల శోభితంబును నగు భారతవర్షమున కంతకు నాతఁడు చక్రవర్తియై యుండెను. ఇప్పుడాతని యుద్దేశ మేమి? ధనపదార్థ సంగ్రహము, మార్గ సంస్కారము మొదలగు వాని విషయమై యాతఁ డెవ్వరికిని నాజ్ఞాపించియుండ లేదు. అతని హృదయ మా పవిత్ర మనోరథ ప్రపూర్ణమై యుండెను. కాని వ్రతాచరణమునకు బూర్వము నియమ సాధనముం బోలె నాతఁడు పూజనీయుఁడగు నుపగుప్తా చార్యుని ప్రబోధనములవలనఁ దీర్థయాత్రో ద్యోగమునందుఁ దన మనః ప్రాణముల నేకీభవింపఁ జేసెను. అశోక మహా రాజా ! నీవే ధన్యుఁడవు ! నీ యదృష్ట మెంత ధన్యమైనది ! నీ గురుబల మెంత ధన్యమైనది ! ఉపగుప్తుఁడుప దేశకుఁ డై యుండఁగా నీవు పరమ సౌభాగ్యసంపన్నుఁడ వై తివనుటలో నేమి యాశ్చర్యమున్నది ?


ఇరువది రెండవ ప్రకరణము


పుణ్య ప్రసంగము

ఏ మహా పురుషుఁ డుపదేశకుఁడుగా లభించుటవలనఁ దాను ధన్యుఁడ నైతినని ధర్మశీలుఁడును, బ్రియదర్శనుఁ డును నగు నశోక సార్వభౌముఁడు భావించుకొను చుండెనో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/88&oldid=334765" నుండి వెలికితీశారు