పుట:ASHOKUDU.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము

79

కుఁడు ధర్మాచార్యుడగు నుపగు ప్తుని సద్గుణములకు ముగ్గుఁడై పోయెను, ఆ రాజశిష్యుని యుదారహృదయమును, నసాధారణగుణగణములును, నన్నిటికంటే నధికం బగునాతని ధర్మైక చింతయు బాగుగఁ డెలిసికొని యుపగుప్తుఁడు కూడ నశోకుని సద్గుణములకు ముగ్ధుఁడై పోయెను. తామిరువురును గలిసియుండుట మిగుల భాగ్యమని యిరువురును దలంచు కొనుచుండిరి. పుణ్యనదీ ప్రవాహ ద్వయ మేక త్రమిళిత మయ్యను. ఇరువురి ప్రార్థనలును సఫలీకృతము లయ్యెను.

విశ్వజన ప్రేమధారాద్వయ మొక్కచో మిళితమయ్యెను. ఆట్లు మిళితము లైన యాధారా వాహీనులు రెండు ననంతసాగర సమ్మిళితములయ్యేను, విశ్వహిత ప్రశాంత సొగరము వాని యెదుట సనంతవి స్తృతమైయుండెను. మానవ పశుపక్షి కీటపతంగ వృక్షుల తా చేత నా చేతనములతో నిండియున్న యీ విశ్వమున కంతకును గల్యాణము కొఱకును, వికాసము కొఱకును, సాహాయ్యము కొఱకును నా యనంత మంగళ సాగరము విరాజమానమగు చుండెను. ఇప్పుడా యిరువురి హృదయములు నా వై పున కే పోవుచుండెను. ఈ దివ్య మార్గము నందలి ప్రథమపథికుఁడును, ప్రేమావ తారుఁడును, భగవానుడు నగు బుద్ధ దేవుని యడుగుజాడల సనుసరించి పోవుటయే యా గురుశిష్యుల యేకాంతో ద్దేశమై యుండెను. బుద్ధ దేవుని పాదరజముచే నే యే స్థలములు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/87&oldid=334631" నుండి వెలికితీశారు