పుట:ASHOKUDU.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

67


దురు. దురదృష్టవశమునఁ దెలియక యం దెవ్వఁడైన నావీర నారీమణులు ధరియించి వచ్చుచున్న యారజ్జుసీమ నతిక్రమించినచోదత్క్షణ మే యాతనికి మరణదండన మగుచుండెను. ఈ విధము లగునరహత్య లే విలాస క్రీడలుగానున్నప్పు డిఁకఁ బశుపక్ష్మి మృగాదులమాట చెప్పవలసిన దేమున్నది? మహారాజగు నశోకుఁడు, బౌద్ధ ధర్మము నవలంబించిన తరువాత నిట్టి దారుణ సమారోహణముల నన్నిటిని రూపుమాపి వైచెను, అతని హృదయమునందలి కరుణాప్రవాహము మహారణ్య సీమ వఱకును బ్రవహించుచుండెను. భయంక రారణ్యముల యందలి జీవులుకూడ నిర్భయముగ సంచరించుట కవకాశము కలిగెను.

అశోక సార్వభౌముఁడు ప్రేమ ధర్మ దీక్షితుఁడై క్రమక్రమముగా నిట్లే భోగవిలాసములను, గ్రీడాకౌతుకములను, వ్యసనములను గూడఁ బరిత్యజించి వైచెను. భోగపరివర్తనమున సంయమన మారంభ మయ్యెను. నవజీవనలాభమునఁ జండా శోకుఁడు ధర్మాశోకుఁ డయ్యెను. బిందుసార సార్వభౌముని యప్రియ పుత్రుఁ డిప్పుడు దేవతలకుఁగూడఁ బ్రియ దర్శను డయ్యెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/75&oldid=334297" నుండి వెలికితీశారు