పుట:ASHOKUDU.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము


పరివర్తనము

ప్రియదర్శనుఁడగు నశోకుఁడు నవజీవనలాభానంతరమునుండియు బౌద్ధధర్మ స్థాపనము కోఱకు విశేష ప్రయత్నంములను గావించెను. బౌద్ధధర్మములను సంస్కరించునిమి త్తము మహాజనసభలఁ గూర్చి చర్చించుట యీ విధమగు ప్రయత్నములలో ముఖ్యమైనది. భగవానుఁడగు బుద్ధ దేవుని నిర్వాణానంతరమునఁ జాలమంది ప్రజలు సత్యధర్మముకొఱకును, శాంతిలాభముకొఱకును బుద్ధమతము నాశ్రయింపఁజోచ్చిరి. క్రమముగా నీ భారతవర్ష మున బౌద్ధధర్మమే ప్రబలమయ్యెను, దేశమునందలి గొప్ప వారందఱునుగూడ బౌద్ధులుగ నే యుండిరి. రాజానుగ్రహము, రాజ్యసుఖ శాసనములనుగూడ జాలవఱకట్టి బౌద్ధ మతావలంబులగు వారి కే యనుకూలములుగ నుండెను. లోకులందఱును బౌద్ధ శ్రమణులను మిగుల గౌరవించుచుండిరి. ఇట్టి సుఖానుభవముకొఱకును గౌరవము కొఱకును జాలమంది బౌద్ధధర్మము నాశ్రయించుచుండిరి. అనేక నీచ బ్రాహ్మణులు శ్రమణ వేషధారులైరి. అట్టివారు తమ బుద్ధి కౌశల్యముచే బుద్ధమత ప్రవ ర్తకులగు జనులలో వికృతాచార వ్యవహారరీతిని వ్యాప్తము చేయసాగిరి. ఆ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/76&oldid=350631" నుండి వెలికితీశారు