పుట:ASHOKUDU.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

అ శో కుఁ డు

యించెను. ఇఁక నాతఁడు చూచుచు నూరకుండఁజాలక పోయేను. అది మొదలుగ నా మహారాజు నిష్ఠురఁబులును నిర్దాక్షిణ్యంబులు నగునట్టి కౌతుక క్రీడలను నిలిపి వేయున ట్లాజ్ఞాపించెను.

ప్రేమావ తారుఁ డైనబుద్ధదేవుని ప్రియశిష్యుఁడగు నశోకుని హృదయమునం బ్రేమశక్తి యుదయించినది. ఆ శక్తియే మహారాజు పాకశాలను, ప్రాసాదములను, బ్రాంగణములను గూడ బరిశుభ్ర పఱచి రాజ్య మందంతటను వ్యాపించి పరిపాలింప నారంభించెను. మహా రాజగునశోకుఁ డిన్నాళ్ళవఱకును విహారార్థము వేటకుఁ బోవుచుండెను, ఆ వేఁట చాల నాశ్చర్యకరమైనది. ఇప్పుడు వేఁట యనినం గొందఱు వేఁటగాండ్రును గొన్ని యేనుఁగులును, గొంతపరి వారమును, గొన్ని తుపాకులును, బల్లెములును మనకు జ్ఞప్తికి వచ్చును. కాని మహా రాజగు నశోకుని కాలమునందు మాత్రము వేఁట మఱియొక విధముగా నుండెను. అతఁడొ కప్పుడు బంగారుపల్లకి నెక్కియు, మఱియొకప్పుడు గజారోహణము చేసియు వేఁటకుఁ బోవుచుండెడివాఁడు. ఆతని నలువంకలను నాయుధహస్తులగు సైనికులును, నమూల్య వేష భూషణాలంకృతలగు వార నారీమణులును గూడఁ బోవు చుండిరి. చుట్టును బరి వేష్టించియున్న రజ్జు మధ్యము నుండి వారఁ దఱును నడచుచుందురు. ఆరజ్జుమండలము చుట్టును శస్త్ర ధారిణు లగు వీరనారీమణులు వేలకొలఁది తిరుగుచుం

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/74&oldid=334292" నుండి వెలికితీశారు