పుట:ASHOKUDU.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ ప్రకరణము

47

చుండిరి! ఒక్క టేశరీరముగ భావించుకొనుచుండిరి. ఇఁకనట్టి రాజ్యమునకుఁ గొదవ యేమున్నది ? అశోకున కప్పటికిని భ్రాతృసంబంధశత్రుత్వము నిశ్శేషము కాలేదు. అశోకుఁడు కేవలము తదేక దృష్టితో విద్రోహులగుసోదరులను సపరివారముగ నశింపఁ జేయుటకై ప్రయత్నించుచు నే యుండెను. ఇట్టికల్లోలములచే నశోకునకుఁ బితృసింహాసనము లభించినను బట్టాభి షేకము జరుగుట కాలస్యము కావలసివచ్చెను——


పదునాలుగవ ప్రకరణము


రక్తప్రవాహము

అశోకునకు సర్వరాజ్యమును లభియించినది. ఆతని ముఖ్యశత్రువులు నిహతులై పోయిన సంగతియు సత్యమే. కాని యాతనికంతమాత్రమున నిశ్చింతుఁడై యుండుట కవకాశము కలుగ లేదు. పూర్వమునుండియు రాజ్యమునందలి ప్రజలును రాజోద్యోగులును రెండుపక్ష ములుగ నేర్పడియుండిరి. కొందఱశోకునిపకక్ష మువారుగను, మణికొందఱు సుషీమునిపక్షము వారుగనునుండిరి. అశోకునిపక్షమువారు ప్రజ లేయయ్యును గొలఁదిమందిమాత్ర మేయుండిరి. ప్రజాసామాన్యమునఁ జాలమంది. సుషీనునిపక్షము వారే యైయుండిరి. మానవలోక

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/55&oldid=349987" నుండి వెలికితీశారు