పుట:ASHOKUDU.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

అ శో కుఁ డు

గాంచి సుషీముఁ దానందోత్ఫుల్ల హృదయుఁ డయ్యెను. పరిభా నిరోధము లేకుండుట చే నెటులయినఁ బ్రాకారమును బగుల గొట్టియో, లంఘించి యో ససైన్యముగ నగరమధ్యమునం దనాయాసముగఁ బ్రవేశింపవచ్చునుగదా యని యాతఁ డాశ పడియెను. ఇట్టియాశ చేత నే యాతఁ డతి వేగముగ సేనల నడిపించుకొని ప్రాకార సమీపమునకు వచ్చి నిలిచెను.

అశోకునిదండనాయకు లిది యంతయును గను పెట్టి చూచుచు నే యుండిరి, మహారణకుశలు రగువారియు పాయము ఫలించినది. సుషీముఁడు ససై న్యముగఁ బ్రాకారమునకు నగడ్తకును మధ్య భాగమునఁ బ్రవేశించి యుండెను. పంచాననము ప్రబలకిరాతునివలలోఁ దగులుకొన్నది. సుషీముఁడు ససైన్యముగ నట్లుండుటం గాంచి యశోకుని సైనికు లాపరిఖయందలి మందునకు నిప్పు ముట్టించిరి. మఱియుఁ బ్రాకారముల పై నుండి నిరంతర బాణవర్షమునుగురియింప సాగిరి. సుషీముఁడు తా నెన్నఁడుఁ గలలో నైన ననుకొనియుండనిపన్నాగమునం బడి ససై న్యముగ నిహతుఁడై పోయెను.

అశోకుని సౌభాగ్యమార్గమున కడ్డముగనున్న కంటక వృక్ష మీవిధముగఁ బెల్ల గింపఁబడిపోయెను.

నవీనుఁ డగు రాజు—ప్రవీణులగుమంత్రులు_రణనీతికుశలు రగుదండనాయకులు — వీరందఱును యుద్ధానంతరమున నొక్కచోఁ గలిసికొనిరి; ఒక్కటేమాటగ మెలంగు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/54&oldid=333671" నుండి వెలికితీశారు