పుట:ASHOKUDU.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

అ శో కుఁ డు

మెంతవికృతముగ మారిపోవుట తటస్థించినను, ధర్మాధర్మ జ్ఞానము' న్యాయాన్యాయ విచారణశక్తి, పాపనిందనము, పుణ్యకాంక్ష మొదలగు సద్గుణము లన్నియు నొక్క సారిగ నాశనము లై పోవఁజాలవు. సుషీముఁడు యువ రాజుగ నుండెను-సత్యధర్మానుసారముగ నాతఁడు పితృసింహాసనమున కుత్తరాధి కారియై యుండెను. బాల్యచాపల్యము చే నై న లోపము లాతనికడ నేవియైననుండిన నుండుఁగాక ! సమయానుకూలముగ వానినన్నిటిని నాతఁడు సవరించుకొనఁ జాలక పోఁడు.”అని యీవిధముగ భావించుకొనుచుఁ బ్రజలలోనను, మంత్రులలో నను జాల భాగమువఱకును సుషీమునియెడలనే యధిక విశ్వాసము కలిగెను. వారి కశోకుఁడు రాజగుట సంతోషకరముగ లేదు. ఇంతియ కాక సర్వవిధముల రాజ్యార్హుఁ డగు సుషీ ముఁడు కపటమార్గమున నన్యాయముగఁ జంపఁబడి పోయెను. అందువలనఁ బ్రజలలోఁ జాలమందికి సుషీముని యెడల జాలి కలిగెను. వారాతనిలోపముల నన్నిటిని మఱచి పోయిరి. అందఱు నాతని కొఱకే తమవిచారమును సూచించుచుండిరి—పతి పుత్ర విహీనలును, మహామహిషీమణులు నగునశోకుని సవతితల్లుల యెడలఁగూడఁ బ్రజాభిప్రాయము సానురూపముగ నుండెను. ప్రజలందఱును వారికష్టములకు విచారించుచుండిరి. ఇట్టి కారణములచే న నేకు లశోకునకు బహిరంగ శత్రువులై పోయిరి. ఇంకను మిగిలియున్న యశో శుని వై మాత్రేయ సోదరులు కూడ నాతని యెడల విరుద్ధాచరణముల నాచరించుచుండిరి,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/56&oldid=333689" నుండి వెలికితీశారు