పుట:ASHOKUDU.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

అ శో కుఁ డు

అశోకుఁడు జనకునియానతిచే నాతనికిఁ బ్రతినిధియై యుజ్జయినీ పట్టణమునం దుండెను. ఆతఁ డారమణీయనగరము నందుండి మిగుల సమర్థతతో నవంతీమండల ప్రజావర్గము ననుకూల శాసనములతో బరిపాలించుచుండెను. అతని ధర్మశాసన సమయమునఁ బ్రజలలో నెట్టివిద్రోహములు గాని, "దేశమునం దెట్టి దుర్భిక్షములు గాని లేదు. ప్రజలు నిరంతర సంతుష్టులై యుండిరి. అతఁడును సుఖసంపూర్ణుఁ డయ్యెను. అశోకుని యౌవనమునందలి ప్రథమ భాగ మీ యుజ్జయినీ నగరమున నే గడచినది. ఆతఁ డా మండలమునందున్నప్పుడే విదిశానగరమునందలి యొక సుప్రసిద్ధవ ర్తకుని తనయను బరమరూపలావణ్యవతి యగుకన్యకను బెండ్లి యాడెను. నవయౌవనము, అప్రతిహతంబగు ప్రతాపమున రమణీయంబగు రాజధాని నగరము, విలాస విభ్రమలీలారం గంబులగు ప్రమోడో ద్యానములు, సకలసంపత్సమృద్ధంబగు రాజ్యము, సుఖసంతుష్టులగు ప్రజలు, రూపయౌవన సంపన్నయు, ననురక్తయునగు ధర్మపత్ని - అశోకున కన్నియును లభియించినవి. ఇవియన్నియును, లభించుటంబట్టియే: యశోకుఁ డుజ్జయినియం దున్నప్పుడు నిరంతరముఁ బరమానందముతో ఁ గాలమును సార్థకముగఁ జేసికొని యేనని చెప్పవచ్చును. గుణములయందలి యాదరము చేతనే తనతండ్రి రాజప్రతినిధిగఁ జేసి తన్నుజ్జయినీ నగరమునకుం బంపియుండెనని యశోకుఁడు భావించుకొనియెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/48&oldid=333563" నుండి వెలికితీశారు