పుట:ASHOKUDU.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము


గృహ సమాచారము

అశోకుఁ డజ్జయినీ నగరమునం దుండి యవంతీ మండలమున సుఖ శాంతివిధానము లాచరించుచుఁ బరమానందమునఁ గాల క్షేపము చేయుచుండెను. అతని కచ్చటనున్న ప్పుడే తా నభ్యసించిన రాజనీతి కౌశల్యమును గార్యరూపమున నుపయోగించుకొనుట కవకాశము దొరకెను.

ఆతఁ డచ్చటనున్న కాలమునం దిచ్చటఁ బాటలీవుత్రమునందు స్థితిగతు లంత బాగుగ లేవు. ఆ రాజాస్థానమునఁ జిరకాలమునుండియు న్యాయసభ యొకటి యుండుటయు దానిమూలమున నే మహారాజు రాజ్య కార్యములం దీర్చుచుండుటయు జరుగుచుండెను. సార్వభౌముఁడగు బిందుసారు(డుకూడ నీనియమము నతిక్రమించి యుండ లేదు. ఆ సభాలోచనలను బట్టియే మగధ రాజ్యము వివిధ భాగములుగ విడఁదీయఁబడుటవలన నున్నతోద్యోగుల సంఖ్య యధిక మయ్యెను. ఆ యుద్యోగు లందఱునుగూడ నాపరి పాలనా సభకు సభ్యులుగ నే యుండిరి. చంద్రగుప్తుని ప్రభుత్వ సమయమునం దిట్టినభ్యు లైదువందలమంది యున్నట్లు చున్నది. బిందుసారుఁడుకూడ వారి యాలోచనల ననుస

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/49&oldid=349978" నుండి వెలికితీశారు