పుట:ASHOKUDU.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

39

అనువిషయము సకల భారత జనసమీచీనమైయున్నది. అవంతీ స్థానమున కాధునిక నామము మాళవ్యము. అవంతీ మండలమునకు రాజధాని యుజ్జయినీ నగరము. మహాకవియుగు కాళిదాసు డాయుజ్జయినీ నగర నామమున కమరత్వమును బ్రసాదించి యున్నాఁడు. విక్రమాదిత్యుని యుజ్జయినీ నగరమునందలి సుధాధవళంబు లగుసుందర సౌధమాలికలును, నలోక 'సామాన్యరూపలావణ్య విలాసవతు లగుపుర పురంద్రీమణుల విలాసవిభ్రమలీలారంగంబు లగురమ్య ప్రమోదా రామంబులును నిప్పు డేమైపోయినవి? అవి యన్నియును గాలవాహినీగర్భమునం గలసిపోయినవి. కాని మహాకవిశిరోమణి యగు కాళిదాసుఁడు తన కావ్యము నందు మాత్రము వానికన్నిటికిని శాశ్వత జీవనమును గల్పించి యున్నాఁడు. ఆమహాకవిసార్వభౌముఁడు తన మేఘసందేశ మహా కావ్యమునందు శాపగ్రస్తుఁడగు యక్షుని చే నవనీరదముంగూర్చి “నీకించుకచుట్టు త్రోవయైనను నొకసారి యుజ్జయినీనగరమునకుఁ బోయి యాపుర విలాసమును గన్నుల కఱవుదీరఁగాంచి నీకన్నులకును జీవితమునకును సార్థక్యముం గూర్చుకొని మఱిపొమ్ము” అని చెప్పించియున్నాఁడు. సాహిత్య సంస్మరణమున కిప్పుడ ప్రస్తుతమే యైనను యథా సమయమున మానవీన పాఠకులకు మహాకవి శేఖరుం డగుకాళి దాసుని మేఘసం దేశ మహా కావ్య నొక సారిపఠింపవలయు నని బోధించుట యసంగత కార్యము కాదని తలంచుచున్నారము.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/47&oldid=333562" నుండి వెలికితీశారు