పుట:ASHOKUDU.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

నగరోపకంఠమున నొక విశాలో ద్యానమునందు రాజకుమారులను బరీక్షించుట కేర్పాటయ్యెను. రాజకుమారు లందఱు నాదినమున నచ్చట నే యుండవలయునని స్థిర పఱచిరి. ఉద్యానమధ్యంబున విశాలంబును, వివ్రతంబును నగు సమప్ర దేశమునఁ గౌముదీ ప్రభలు కన్నులపండువు సేయుచుండెను. ఆ వెన్నెలబయట విచిత్రాసనము లలంకరించబడి యుండెను. ఆ చుట్టును నవదూర్వాంకుర శ్యామంబును, వర్తులా కారంబును నగు భూతలము నయనాభిరామంబై యుండెను.

సూర్యోదయమైనది మొదలుగ నా సభాస్థలమునకు జనులు వచ్చుటకారంభించిరి. రాజకుమారులు కూడ నొక్కరొక్కరుగ నా యాసమయములయందు వచ్చి యాసీనులగు చుండిరి. రాజపుత్రులందఱును మనోజ్ఞ వేష భూషణాలంకృతులై యుండిరి. రథారూఢులై కొందఱును, తురగారూఢులై కొందఱును వచ్చి ప్రవేశించుచుండిరి. క్రమముగ నందఱును వచ్చిరి. మహా రాజును మంత్రులునుగూడ సభాస్థలమునకు విచ్చేసి యుండిరి. కేవల మొక్కఁడుమాత్ర మచ్చటికి వచ్చియుండ లేదు. రాజకుమారుఁడగునశోకునకు యథాసమయ మునందీసంగతి తెలిసినది కాదు. అందులకుఁ గారణము వేఱుగఁ జెప్పవలయునా? ఆ చంద్రశాలారంగమున—— ఆ సుందర కుమార మధ్యమునఁ గురూపియగు నశోకుఁడు ప్రవే శించుటకు మహా రాజున కిష్టము లేదు. కాని యాతఁడంత

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/39&oldid=333533" నుండి వెలికితీశారు