పుట:ASHOKUDU.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

అ శో కుఁ డు

తండ్రి వై ముఖ్యము, సవతితల్లులయసూయ, సోదరుల తూష్ణీ భావము, గురువులబోధనము, ఉత్సాహసంకల్పనము, జననీ ప్రేమము, యత్నము, సాంత్వనము మొదలగువాని నడుమ నశోకుని శైశవ జీవితము గడచుచుండెను.


తొమ్మిదవ ప్రకరణము

అశోకుని భవిష్యత్తు

ఒక దినమున మహా రాజగు బిందుసారుడు తన కుమారుల విద్యాశిక్షణముంగూర్చి పరీక్షింపవలయునని తలంచెను. విద్యావిషయంబున నెవ్వ రెంతటి విజ్ఞానమును సంపాదించిరో తెలిసికొనుట యావశ్యక మని మహా రాజు భాంవి చెను. రూపగుణశీలంబుల నధికుండగు రాజకుమారుఁ డే భవిష్యత్ప్ర భుపదంబున కర్హుఁడై యుండునని యాతని యభిప్రాయము.

శక్తిమంతులును విత్తవంతులు నగువారి కోరికలు కార్యరూపమునఁ బరిణమించుటకు విశేషకాలము పట్టదు. మహా రాజు తన యుద్దేశమును బ్రకటించినతోడనే రాజ కుమారులను బరీక్షించుటకుఁ దగినస్థలమును, దగిన సమయమును గూడ నిర్దిష్టములయ్యెను. అన్నియును సంసిద్ధము లయ్యెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/38&oldid=333531" నుండి వెలికితీశారు