పుట:ASHOKUDU.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

అ శో కుఁ డు

రాణియగు సుభద్రాంగి కిప్పుడు మంచి కాలము వచ్చినది. ఆమెయిప్పుడు రాజాధి రాజగుబిందుసారునకు రాణులలో నెల్లఁ బ్రియుతమురాలై యుండెను. సుభద్రాంగికిఁ గష్టసమ యము గడచిపోయినది; సుఖ సమయము వచ్చినది. అదియునుగడచిపోవుచున్నది; దినము, యామిని, మాసము, వత్సరము, శిశిరమ, వసంతము మొదలగునవి యన్నియు జక్రావర్త న్యాయమునఁ దీవ్ర వేగముతో వచ్చుచుఁ బోవు చుండును.

వానితోగూడఁ గోరుకొనఁదగిన సుఖ సమయమునందలి నూతనత్వముకూడ జరగిపోవుచున్నది. ఇప్పుడామెహృదయమింకను నట్టినూతనత్వముకొఱకు వ్యాకు లపడుచుండెను. అనూతనశ్వమునందలి మనోహరత్వముం గూర్చి తెలుపుచు యమున యామెకోరికలను మఱింత వర్ధిల్లఁ జేయుచుండెను. సుభద్రాంగిసపత్ను లందఱును బుత్రవతులై యుండిరి. ఆ మెకుమాత్రమింకను బుత్రముఖ సందర్శన సుఖలాభము కలుగ లేదు. ఆ కారణము చేఁ దన పై మహా రాజున కించుక యనాదరము కలుగునేమో యను విచారమామె హృదయ మును వేధింపసాగెను.

రాణి యగుసుభద్రాంగి సంపూర్ణయౌవనవతియై యుండెను. ఆమె హృదయమున నిరాశాచ్ఛాయలించుకించుక ప్రసరించుచుండుటచే నా మెరూపయౌవన విలాసకాంతులించు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/32&oldid=333430" నుండి వెలికితీశారు