పుట:ASHOKUDU.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

25

కించుకమ్లానములు కాఁజొచ్చెను. కాని, యా రాజ్ఞీ మణి కట్టి యవస్థ యెన్నియోదినమ లవఱకు నిలిచియుండ లేదు. ఆమె కిప్పు డించుక యస్వస్థతగా నున్నట్లు తోచుచుండెను. హంస తూలికా తల్పమున శయనించుటకూడ నామెకుఁ గష్టముగా నుండెను; సుఖాద్యములుకూడ నన పేక్షితము లైపోయెను; అమృతమునందును నరుచి యుదయించెను—మట్టి దిన వలయునని మనసయ్యెను అప్పుడు సుభద్రాంగి యమునతోఁ దనశరీర పీడం గూర్చి యంతయును జెప్పెను. ఆ మాటల నాలించి యమున పరమానందముతో. “అమ్మా! ఇవియన్నియును బీడా లక్షణములు కావు —— సర్వమును శుభలక్షణములే" అని బోధి చెను.

క్రమముగా నీ సంగతి యతఃపురమునందంతటను వ్యాపించెను. నూత్న రాజ్ఞీ మణి కూడ సంతానవతి యగునని యందఱు ననుకొనుచుండిరి. గర్భస్థ శిశువు దిన దినము నెట్లు వరిల్లు చుండెనో యట్లే సుభద్రాంగి సపత్నుల యీర్ష్యాసలము కూడ వర్ధిల్లఁ జొచ్చెను. అప్పుడు రాఱులలో గొందఱు “మంచిది, సుభద్రాంగి గర్భవతి యైనది. అదృష్టవంతురాలు! మంచిసం తాన మే కలుగును. "కాని, రాకరాక గర్భము వచ్చినది. ఇంతవయసులోఁ దొలుచూలు ! నిరపాయముగఁ బ్రసవిఁప వలయును గద!ఏమో! ఏనాటి కెట్లు వచ్చునో యెవ్వరికిఁ దెలియును” అనియనుకొనుచుండిరి. కోటయం దంతటను నామె

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/33&oldid=333432" నుండి వెలికితీశారు