పుట:ASHOKUDU.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

అ శో కుఁ డు

గర్భముంగూర్చినమాటలే. ఆగర్భమే యామె జీవితమార్గమును నిష్కంటక ముగఁ జేసి వైచెను; ఇదియే యామెరాజ్ఞీ స్థానమును దేవతా స్థానముగఁ బరిణమింపఁ జేసెను!!

దేవత లెల్లప్పుడు నందఱ ప్రార్థనములను — అన్ని ప్రార్ధనములను సంపూర్ణముగ సిద్ధింపఁ జేయరు. సుభద్రాంగిసపత్నుల మనోగత ప్రార్థనములు సంపూర్ణముగ ఫలియింప లేదు. రాణియగుసుభ ద్రాంగి యొక శుభమూహూర్తమునం దొక కుమారుని గనియెను. కొత్త రాణి పుత్రవతి యయ్యెను. ప్రసనసమయమునందామె కెట్టి కష్టమును గలుగ లేదు, ఆ కారణముచే గుమారున కశోకుఁ డని నామకరణము గావింపఁబడియెను.


ఎనిమిదవ ప్రకరణము

అశోకుని శైశవము

రాజ్ఞీ రత్న మగు సుభద్రాంగిపుత్రముఖసందర్శనమున బరమానంద భరితహృదయ యయ్యెను. మహా రాజుకూడఁ దనవ లె నేయానవ కుమారసందర్శనమునఁ బరమానందరస నిమగ్నుఁడగు నని యామె యనుకొనియెను. కాని యామెకోరిక యీ విధముగ ఫలియింప లేదు. మహారాజు యధా సమయమునందే పుత్రముఖావలో కనముంగావించెను. కాని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/34&oldid=349834" నుండి వెలికితీశారు